హైదరాబాద్‌లో ‘బుర్జ్ ఖలీఫా’.?

|

Aug 26, 2019 | 8:55 AM

అమెరికా తరహాలో హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ భవనం ఒకటి రానుందా.. అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్ఎండీఏకు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తుతో 66 అంతస్తుల్లో నిర్మించే ఈ ఆకాశ హర్మ్యం అనుమతి కోసం ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. […]

హైదరాబాద్‌లో బుర్జ్ ఖలీఫా.?
Follow us on

అమెరికా తరహాలో హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ భవనం ఒకటి రానుందా.. అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టనుంది. ఈ భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్ఎండీఏకు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తుతో 66 అంతస్తుల్లో నిర్మించే ఈ ఆకాశ హర్మ్యం అనుమతి కోసం ఒక ప్రైవేటు నిర్మాణ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కోకాపేట‌లో నిర్మించే ఈ భారీ భవన ప్రాజెక్టుకు సుమారు 1800 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకూ ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇక ఈ భారీ టవర్‌లో షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్‌తో పాటు వ్యాపార కార్యాలయాల్ని కూడా ఏర్పాటు చేయనున్నారట. సర్వీసు అపార్ట్‌మెంట్లు, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్‌తో పాటు ఫైవ్ స్టార్ హోటల్స్‌ లాంటివి కూడా నిర్మిస్తారని సమాచారం. మరోవైపు నగర అందాల్ని అస్వాదించేందుకు వీలుగా స్కైలాంజ్‌ను ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.