‘మన్కడింగ్’ అశ్విన్‌కు మతిపోగొట్టే న్యూస్.. కెప్టెన్‌గా

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అశ్విన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడిపై ఫ్రాంచైజీ వేటు వేయనుందని సమాచారం. అశ్విన్‌ ప్లేస్‌లో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ అశ్విన్‌ను రూ.7.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. రెండు సీజన్లలోనూ పంజాబ్ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:14 am, Mon, 26 August 19
'మన్కడింగ్' అశ్విన్‌కు మతిపోగొట్టే న్యూస్.. కెప్టెన్‌గా

టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న అశ్విన్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడిపై ఫ్రాంచైజీ వేటు వేయనుందని సమాచారం. అశ్విన్‌ ప్లేస్‌లో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

2018 ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ అశ్విన్‌ను రూ.7.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. రెండు సీజన్లలోనూ పంజాబ్ ఆశించినంత మేరకు రాణించలేదు. జట్టులో మేటి ఆటగాళ్లు ఎందరున్నా.. వారిని అశ్విన్ సరిగ్గా ఉపయోగించుకోలేక విఫలమయ్యాడు. కెప్టెన్‌గా పూర్తి విఫలమైన అతడిని తప్పించి ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారట. అటు టీమ్‌కు హెడ్ కోచ్ కోసం కూడా వెతుకుతోంది యాజమాన్యం. జార్జ్ బెయిలీ, ఆసీస్ మాజీ కోచ్ డారెన్ లెహ‌మాన్‌లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరితో చర్చలు జరుగుపుతున్న యాజమాన్యం ఈ వారం చివరిలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది.