AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విమ్మింగ్ పూల్లో 5,880 బంగారు కడ్డీలు..

స్మిమ్మింగ్ పూల్ కింద బంగారం దొరకడం మీరు ఎప్పుడైనా చూశారా..? కానీ ఇక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ కింద ఏకంగా వందల కిలోల బంగారు కడ్డీలు దొరికాయి. బెంగళూరులో పట్టుబడిన ఈ బంగారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల విలువైన ఐఎంఏ గ్రూప్ అధిపతి మొహమ్మద్ మన్సూర్ ఖాన్ కు చెందిన బెంగళూరులోని ఓ భవంతిలో సిట్ అధికారులు సోదాలు జరిపారు. ఆరో అంతస్తులో గల స్విమ్మింగ్ పూల్ కింద గతంలో మన్సూర్ […]

స్విమ్మింగ్ పూల్లో 5,880 బంగారు కడ్డీలు..
Anil kumar poka
|

Updated on: Aug 08, 2019 | 12:29 PM

Share

స్మిమ్మింగ్ పూల్ కింద బంగారం దొరకడం మీరు ఎప్పుడైనా చూశారా..? కానీ ఇక్కడ ఓ స్విమ్మింగ్ పూల్ కింద ఏకంగా వందల కిలోల బంగారు కడ్డీలు దొరికాయి. బెంగళూరులో పట్టుబడిన ఈ బంగారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. వేల కోట్ల విలువైన ఐఎంఏ గ్రూప్ అధిపతి మొహమ్మద్ మన్సూర్ ఖాన్ కు చెందిన బెంగళూరులోని ఓ భవంతిలో సిట్ అధికారులు సోదాలు జరిపారు. ఆరో అంతస్తులో గల స్విమ్మింగ్ పూల్ కింద గతంలో మన్సూర్ దాచిన 5,880 నకిలీ బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. తన గ్రూప్ లో భారీగా పెట్టుబడులు పెట్టండంటూ ఈ నకిలీ బంగారం కడ్డీలను చూపించి ఇన్వెస్టర్లను మన్సూర్ మోసం చేసేవాడని సిట్ వెల్లడించింది.

కాగా అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులలో కొందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని, ఫలితంగా తాను మోసపోయానని..ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేసి అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఐ మానిజటరీ అడ్వైజరీకి చెందిన దాదాపు రూ. 209 కోట్ల ఆస్తిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. సుమారు 40 వేల మంది డిపాజిట్ దారులను వంచించిన మన్సూర్ ఖాన్ కు చెందిన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఈడీ స్పష్టం చేసింది.  ఇందులో రూ. 197 కోట్ల స్థిరాస్తి, రూ. 12 కోట్ల నగదు ఉన్నట్లు ఈడీ పత్రికా ప్రకటన లో వెల్లడించింది.

Follow Us
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
ప్రియుడి కోసం భారత్‌కు రష్యా యువతి
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం