AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగంలోకి సిబిఐ.. వివేకా హత్యకేసు తేలేనా?

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ సిట్ కొనసాగిస్తుందా? లేక సీబీఐ పరిధిలోకి వెళుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు విచారణకు స్వీకరించడం కలకలం రేపుతోంది. ఈనెల 23వ తేదీలోగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. వివేకా హత్య జరిగి 9 నెలలు గడిచినా నిందితులెవరో నేటికీ తేలకపోవడం సిట్ […]

రంగంలోకి సిబిఐ.. వివేకా హత్యకేసు తేలేనా?
Rajesh Sharma
|

Updated on: Dec 18, 2019 | 6:35 PM

Share

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణ సిట్ కొనసాగిస్తుందా? లేక సీబీఐ పరిధిలోకి వెళుతుందా? ఈ ప్రశ్న ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు విచారణకు స్వీకరించడం కలకలం రేపుతోంది.

ఈనెల 23వ తేదీలోగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. వివేకా హత్య జరిగి 9 నెలలు గడిచినా నిందితులెవరో నేటికీ తేలకపోవడం సిట్ దర్యాప్తు తీరును ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో దర్యాప్తు సంస్థ నివేదిక తయారుచేసే పనిలో నిమగ్నమైంది..ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు వివరాలను నివేదిక రూపంలో సమర్పించేందుకు దర్యాప్తు బృందం కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది మార్చి నెల 15వ తేదీన పులివెందులలోని తన స్వగృహంలో వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసు విచారణకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మొదటి సిట్ బృందాన్ని నియమించింది.. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కడప ఎస్పీ అభిషేక్ మొహంతి ఆధ్వర్యంలో మరో సిట్ బృందాన్ని విచారణ నిమిత్తం నియమించింది. మొహంతి అర్ధాంతరంగా దీర్ఘకాల సెలవుపై వెళ్లడంతో మూడో సిట్ బృందం తెరపైకి వచ్చింది.

అయినా ఇప్పటికీ ఈ హత్యకేసులో ఏ ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డిలను సిట్ బృందం పిలిచిన అనంతరం ఒక్కసారిగా సీన్ మారింది. సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని సీబీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో సిట్ అధికారులు డిఫెన్స్‌లో పడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 23న దర్యాప్తు వివరాలు సమర్పించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు