అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రంలోని బేవ్యూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ వసీమ్ అలీ అనే యువకుడు మృతి చెందాడు. అలీ ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీ కొట్టడంతో.. తీవ్ర గాయాలపాలైన అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలీ అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించాలని.. తమ వీసా ప్రాసెస్‌కు సహాయం చేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ను కోరారు. తాము అమెరికా వెళ్లేందుకు చట్టపరమైన అనుమతులు పొందేలా సహాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ను అలీ తల్లిదండ్రులు కోరారు.