ఆఫ్ఘన్ అధ్యక్ష భవనంలో 20 మందికి కరోనా పాజిటివ్..
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో కరోనావైరస్ సంక్రమణ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్యాలెస్‌లో

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో కరోనావైరస్ సంక్రమణ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు అష్రఫ్ ఘని ప్యాలెస్‌లో పనిచేస్తున్న సుమారు 20 మందిలో కరోనా ఇన్‌ఫెక్షన్ కనిపించింది. అయితే అధ్యక్షుడు అష్రఫ్ ఘని కూడా కరోనా వైరస్ సంక్రమణకు గురయ్యారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
కాగా.. ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రెసిడెంట్ ప్యాలెస్‌లో పనిచేస్తున్న సుమారు 20 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. అష్రాఫ్ ఘని ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. కరోనా వైరస్ కారణంగా కాబూల్‌లో లాక్డౌన్ కొనసాగుతోంది. దీనిని ఇది ఇటీవల మూడు వారాల పాటు పొడిగించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇప్పటివరకు 933 కరోనా కేసులు నమోదయ్యాయి. 33 మంది మరణించారు.