AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రైవేట్ రవాణాపై కరోనా దెబ్బ..!

లాక్‌‌డౌన్‌‌తో ప్రైవేట్ రవాణా వ్యవస్థపై గట్టిగానే దెబ్బ పడింది. 20 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయని బస్‌‌, కార్‌‌‌‌ ఆపరేటర్స్‌‌ కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(బీఓసీఐ) పేర్కొంది. మరో 40 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రైవేట్ రవాణాపై కరోనా దెబ్బ..!
In this March 29, 2016 photo, Ola cabs, left, waiting for customers are parked next to other cars in Kolkata, India. Aiming to wrest control of India’s booming taxi market, two cab-hailing smartphone apps, Uber and Ola, are promising hundreds of millions in new investments while also facing off with one another in court. (AP Photo/ Bikas Das)
Balaraju Goud
|

Updated on: Jun 22, 2020 | 4:48 PM

Share

కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఈ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా ప్రైవేట్ రవాణాకు చెందిన బస్సులు, టాక్సీల నిర్వహకులు ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ భారంగా మారి ఉద్యోగుల్లో కోతల విధిస్తున్నారు. దీంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడుతున్నారు.

లాక్‌‌డౌన్‌‌తో ప్రైవేట్ రవాణా వ్యవస్థపై గట్టిగానే దెబ్బ పడింది. 20 లక్షలకు పైగా ఉద్యోగాలు పోయాయని బస్‌‌, కార్‌‌‌‌ ఆపరేటర్స్‌‌ కాన్ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా(బీఓసీఐ) పేర్కొంది. మరో 40 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

లాక్‌‌డౌన్‌‌ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తి స్తంభించిపోయింది. అక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 95 శాతం వెహికల్స్‌‌ కదలని పరిస్థితి. దీంతో వ్యాపారం నిలిచిపోయి తమ ఉద్యోగులకు జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దేశం వ్యాప్తంగా 20 వేల ఆపరేటర్లను ప్రైవేట్ రవాణా వ్యవస్థను నిర్వహిస్తున్నాయి. అయా ఆపరేటర్లకు చెందిన 15 లక్షల బస్సులు, మ్యాక్సీ క్యాబ్‌‌లు, 11 లక్షల టూరిస్ట్‌‌ ట్యాక్సీలు కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నాయని బీఓసీఐ వివరించింది.

ఈ కోటి మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 15–20 లక్షల మందిని ఆపరేటర్లు ఉద్వాసన పలికారు. మరో 30–40 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోనున్నట్లు బీఓసీఐ పేర్కొంది. తమ భవిష్యత్తు గాడిలో పడాలంటే ప్రభుత్వం చొరవచూపాలని వేడుకుంటున్నారు. మోటర్‌‌‌‌ వెహికల్‌‌ ట్యాక్స్‌‌లను రద్దు చేసి, డీజిల్‌‌పై రాయితీ ఇవ్వాలని, ఇంటర్‌‌‌‌ సిటీ ట్రావెల్‌‌కు టోల్‌‌ ట్యాక్స్‌‌లను రద్దు చేయాలని ఆపరేటర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. మూడు నెలల్లో రోడ్డెక్కని వాహనాలకు కనీసం మూడు నెలల వెహికల్‌‌ ఇన్సూరెన్స్‌‌లను పొడిగించాలని కోరారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత