జవాన్లపై హోటల్ సిబ్బంది దాడి

| Edited By:

Jun 03, 2019 | 11:25 AM

ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్‌లో రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరు ఆర్మీ జవాన్లపై విరుచుకుపడ్డారు. రోడ్డుపైకి ఈడ్చి బూతులు తిడుతూ కర్రలతో విచక్షణారహితంగా చావబాదారు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులతో ఓ జవాన్ కాసేపు తలపడినా వారి బలం ముందు నిలబడలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన దుండగులు అతడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన జవాన్లు, సిబ్బంది మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇరువురు […]

జవాన్లపై హోటల్ సిబ్బంది దాడి
Follow us on

ఉత్తరప్రదేశ్ బాఘ్‌పట్‌లో రెస్టారెంట్ సిబ్బంది ఇద్దరు ఆర్మీ జవాన్లపై విరుచుకుపడ్డారు. రోడ్డుపైకి ఈడ్చి బూతులు తిడుతూ కర్రలతో విచక్షణారహితంగా చావబాదారు. దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుండగులతో ఓ జవాన్ కాసేపు తలపడినా వారి బలం ముందు నిలబడలేక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో మరింత రెచ్చిపోయిన దుండగులు అతడిపై విచక్షణారహితంగా దాడిచేశారు.

రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన జవాన్లు, సిబ్బంది మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇరువురు సహనం కోల్పోవడంతో అది కాస్తా పెద్దదిగా మారింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలేం జరిగిందనే దానిపై దర్యాప్తు ప్రారంభించారు.