ఉస్మానియాలో కరోనా టెర్రర్.. 12 మందికి సోకిన వైరస్..

ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశికళ టీవీ9 తో మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిద్-19 పాజిటివ్ గా వచ్చిందని తెలిపారు. దీంతో ఉస్మానియా పీజీ విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.

ఉస్మానియాలో కరోనా టెర్రర్.. 12 మందికి సోకిన వైరస్..
Follow us

| Edited By:

Updated on: Jun 02, 2020 | 4:23 PM

ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశికళ టీవీ9 తో మాట్లాడుతూ.. ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిద్-19 పాజిటివ్ గా వచ్చిందని తెలిపారు. దీంతో ఉస్మానియా పీజీ విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. కాలేజ్ యాజమాన్యం ఇప్పటికే రీడింగ్ రూమ్ ను మూసివేసింది. ప్రతి ఒక్క పీజీ విద్యార్థిని PPE కిట్స్ ధరించమని ప్రిన్సిపల్ శశికళ సూచించారు. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటంతో జీహెచ్ ఎంసీ హాస్టల్ మొత్తాన్ని శానిటైజేషన్ చేసింది. ఈ నెల 20 నుండి పీజీ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంతలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కరోనా పాజిటివ్ వచ్చిన వారు పరీక్షలు రాసేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. ఔట్ పేషేంట్ విభాగాలకు జూనియర్ డాక్టర్లను పంపాలా.. వద్దా.. అని పునరాలోచన చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న 10 హాస్పిటల్స్ లోని వివిధ విభాగాల్లో జూనియర్ డాక్టర్లు పనిచేస్తున్నారు.