శ్రీలంక ఉగ్రదాడిలో 10కి చేరిన భారత మృతులు

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి […]

శ్రీలంక ఉగ్రదాడిలో 10కి చేరిన భారత మృతులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 23, 2019 | 2:58 PM

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో భారత మృతుల సంఖ్య 10కి చేరుకున్నట్లు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం తెలిపారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 310కి చేరినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందున్నట్లు తెలిపింది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న 40 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి చట్టం అమలు చేస్తున్నట్లు శ్రీలంక రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.