గోవిందరాజా నీ కిరీటం దొరికిందయ్యా!

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన స్వర్ణ కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎనభై రోజులు శ్రమించి, 230 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకోగలిగారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్‌ ఈ చోరీలో సూత్రధారి అని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కిరీటాన్ని దొంగిలించిన ఆకాశ్ స్నేహితుడితో కలిసి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన స్నేహితుడిని మాత్రం చెన్నైకు పంపాడని వివరించారు. ఆ […]

గోవిందరాజా నీ కిరీటం దొరికిందయ్యా!
Follow us

| Edited By:

Updated on: Apr 23, 2019 | 5:29 PM

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో జరిగిన స్వర్ణ కిరీటాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎనభై రోజులు శ్రమించి, 230 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకోగలిగారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఖాందార్‌కు చెందిన ఆకాశ్‌ ఈ చోరీలో సూత్రధారి అని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కిరీటాన్ని దొంగిలించిన ఆకాశ్ స్నేహితుడితో కలిసి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన స్నేహితుడిని మాత్రం చెన్నైకు పంపాడని వివరించారు. ఆ తరువాత రేణిగుంట నుంచి రైల్లో హైదరాబాద్ వెళ్లినట్టు ఆయన చెప్పారు. అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మళ్ళీ రైలెక్కి నాందేడ్‌ జిల్లా ఖాందార్‌ చేరుకున్నాడని వివరించారు. అక్కడ కిరీటాన్ని అమ్మేందుకు ప్రయత్నం చేశాడని, ఎప్పటికప్పుడు సీసీ టివి ఫుటేజీలను పరిశీలిస్తూ పోలీసులు 89 రోజుల పాటు నిర్విరామంగా శ్రమించి నిందితుడిని పట్టుకున్నారని తెలిపారు. ఇందుకు శ్రమించిన పొలిసు సిబ్బందిని అభినందించారు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..