గోవాలో “చికెన్ దెయ్యం”.. ఆ వంతెన పై వెళ్తే ఇక అంతే..

గోవా అనగానే ముందుగా బీచ్‌లు గుర్తొస్తాయి. గోవా ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కాని గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. భయంకరమైన దెయ్యాలు కూడా ఉంటాయి. గోవాలో ఫేమస్ అయిన కేఫ్‌లు, బీచ్‌లు, చర్చిలు, ఫేమస్ దెయ్యాలు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. దెయ్యాల సీన్లు అంటే సినిమాల్లో మాత్రమే చూస్తాం. కాని గోవాలో కూడా అలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయట. బోరిమ్ వంతెన పై రాత్రిపూట ప్రయాణించేవారికి ఓ మహిళ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:48 pm, Wed, 21 August 19
గోవాలో "చికెన్ దెయ్యం".. ఆ వంతెన పై వెళ్తే ఇక అంతే..

గోవా అనగానే ముందుగా బీచ్‌లు గుర్తొస్తాయి. గోవా ట్రిప్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. కాని గోవా అంటే బీచ్ లు మాత్రమే కాదు.. భయంకరమైన దెయ్యాలు కూడా ఉంటాయి. గోవాలో ఫేమస్ అయిన కేఫ్‌లు, బీచ్‌లు, చర్చిలు, ఫేమస్ దెయ్యాలు ఉండే ప్రాంతాలు కూడా ఉన్నాయి. దెయ్యాల సీన్లు అంటే సినిమాల్లో మాత్రమే చూస్తాం. కాని గోవాలో కూడా అలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయట. బోరిమ్ వంతెన పై రాత్రిపూట ప్రయాణించేవారికి ఓ మహిళ నదిలోకి దూకినట్లు, వంతెనపై నడుస్తున్నట్లు కనిసిస్తోందట. కొందరైతే వంతెనపై ప్రయాణించే సమయంలో వెనుక ఎవరో వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని చెబుతుంటారు. దీని వెనుక అసలు విషయం తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు కాని.. తెలుసుకోలేకపోయారు.

ఒకప్పుడు గోవాలోని డిమెల్లో హౌస్ ఎంతోమంది పర్యాటకులను ఆకట్టుకునేంది. అయితే, ఈ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఇద్దరు అన్నదమ్ములు పోటీపడేవారు. వారి గొడవలు చివరికి హత్యకు దారి తీసింది. అన్న చేతిలో హత్యకు గురైన తమ్ముడు ఆ ఇంట్లో ఆత్మలా సంచరిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఒక్కోసారి ఆ ఇంట్లో నుంచి భయానకమైన అరుపులు, కేకలు, శబ్దాలు కూడా వినిపిస్తాయని వారు తెలిపారు.