Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

సినిమాల్లోకి ‘లక్ష్మీ పార్వతి’.. ఎంట్రీ కన్ఫామ్..!

Lakshmi Parvathi is going to debut in Movies, సినిమాల్లోకి ‘లక్ష్మీ పార్వతి’.. ఎంట్రీ కన్ఫామ్..!

ఇతర నాయకులతో సమానంగా.. రాజకీయాల్లో.. ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చారు లక్ష్మీపార్వతి. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కన్నుమూసిన తరువాత.. ఆమె రాజకీయాల్లో కీలక వ్యక్తిగా మారారు. లక్ష్మీ పార్వతి అంటే కేవలం ఎన్టీఆర్ సతీమణిగానే కాకుండా.. నటన పరంగా కూడా.. ఆమెకు ప్రాముఖ్యత ఉంది. ఎన్టీఆర్‌కు పరిచయం అవకముందు లక్ష్మీ పార్వతి.. నాటక రంగంలో పలు నాటకాలు వేసేవారు. ఇప్పుడు.. ఆ అనుభవంతోనే ఆమె సినిమాల్లోకి రాబోతున్నారు. అంతేకాకుండా.. ఈ విషయాన్ని లక్ష్మీ పార్వతి.. కన్ఫామ్ కూడా చేశారు. ఇటీవలే ఈ విషయంపై ఓ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

నాగార్జునతో ‘ఢమరుకం’ సినిమా చేసిన డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి.. లక్ష్మీపార్వతిని సిల్వర్ స్క్రీన్‌కి పరిచయం చేయబోతున్నారు. ఇటీవలే.. ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీసిన శ్రీనివాసరెడ్డి.. ఆ తర్వాత సినిమా లక్ష్మీ పార్వతితో చేయబోతున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా.. ఈ సినిమాకి ‘రాధాకృష్ణ’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలో.. కథను మలుపు తిప్పే పాత్రలో లక్ష్మీ పార్వతి కనిపిస్తారని తెలుస్తోంది.

Related Tags