కీర్తి సురేష్ 20వ చిత్రం.. “మిస్ ఇండియా” టీజర్ రిలీజ్
మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్‌తో అందరిని ఆకర్షించిన కీర్తి సురేష్ ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు తెలుగులోను ఓ సినిమా చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కీర్తి సురేష్ 20వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తుండగా, నరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి మిస్ ఇండియా అనే […]

మహానటి సినిమాతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సినీనటి కీర్తిసురేష్. అలనాటి తార సావిత్రి బయోపిక్‌తో అందరిని ఆకర్షించిన కీర్తి సురేష్ ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు తెలుగులోను ఓ సినిమా చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కీర్తి సురేష్ 20వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తుండగా, నరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కాగా ఈ సినిమాకి మిస్ ఇండియా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ తో పాటు జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్ర, సుమంత్, పూజిత పొన్నాడ, కమల్ కామరాజ్, నదియా తదితరులు నటిస్తున్నారు. తాజగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.