Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా...

Kakinada: హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ దింపుతున్న కార్మికుడు.. ఇంతలో ఒక్కసారిగా…

Ram Naramaneni

|

Updated on: Mar 03, 2025 | 12:30 PM

కాకినాడ నగరంలోని వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపు వద్ద పేలుడు సంభవించింది. హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను వ్యాన్ నుంచి దించి కింద పడేయగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్‌‌లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఓ కార్మికుడు పెద్ద పార్శిల్‌ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.  అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Published on: Mar 03, 2025 12:17 PM