బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
బూడిద గుమ్మడికాయలు సాధారణంగా దిష్టి తగలకుండా ఇంటిముందు భాగంలో కడతారు. కానీ ఈ బూడిద గుమ్మడికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సర్వరోగ నివారిణి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. బూడిద గుమ్మడి ఔషధాల గని అంటున్నారు. అంతేకాదు బూడిద గుమ్మడికాయ మంచి పోషకాహారం అని చెబుతున్నారు. బూడద గుమ్మడికాయను జ్యూస్ చేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అంతేకాదు, అనేక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుందట. షుగర్‌ను కంట్రోల్ చేయడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుందంటున్నారు. షుగర్ ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయట.ప్రతి రోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. నిద్రలేమితో బాధపడే వాళ్లకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఎంపిక.
ఈ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే నిద్రలేమి నుంచి బయిటపడొచ్చు. గుమ్మడికాయ రసాన్ని తెలుసుకోవడం వలన వాత, పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. హెల్తీగా ఉండొచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. బూడిద గుమ్మడి జ్యూస్ తాగితే యూటిఐ తగ్గుతుంది. మంచి ఎనర్జీని ఇస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా దీన్ని తీసుకోవడం వలన ఒంట్లో ఉన్న మలినాలు బయటకు వెళ్లిపోతాయి. సైనస్ సమస్యలు ఉంటే కూడా దీనిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడిలోని విటమిన్లు, ఖనిజాలు, ఆహార ఫైబర్‌తో నిండిన బూడిద గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
పెళ్లి పీటలపై ఆగిపోయిన వివాహం.. వరుడి నిర్వాకం తెలిసి షాక్!వీడియో
పెంపుడు శునకానికి అనారోగ్యం..మాజీ న్యాయమూర్తి భావోద్వేగం
మనుషులకే కాదు.. చెట్లకు సైతం’డిజిటల్ ట్రీ ఆధార్’ వీడియో
గంటలు గడుస్తున్నా.. కానరాని 8 మంది జాడ వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
