మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!
ఐపీఎల్ 13వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు.
IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండేను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓపెనర్ గోస్వామి పెవిలియన్ చేరిన అనంతరం బరిలోకి దిగిన పాండే.. ఆ ఓవర్ రెండో బంతికి షాట్ ఆడాడు. దాన్ని మొయిన్ అలీ ఫీల్డ్ చేసి బంతిని కోహ్లీకి అందించాడు.
‘బహుత్ బడియా.. ఆజ్ నహీ మార్ రహా షాట్.. అచ్చా చలో’.. అంటూ పాండేను ఉద్దేశించి కోహ్లీ బిగ్గరగా అరిచాడు. ఇక దాన్ని మనీష్ పాండే పర్సనల్‌గా తీసుకుని బ్యాట్‌తో సమాధానం ఇచ్చాడు. కోహ్లీ స్లెడ్జ్ చేసిన తర్వాత బంతిని వదిలేసిన పాండే.. ఆ ఓవర్ నాలుగో బంతికి సిక్స్ కొట్టి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అయితే కోహ్లీ స్లెడ్జింగ్ హైదరాబాద్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చింది. సహచర క్రికెటర్‌పై స్లెడ్జింగ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, లీగ్ స్టేజిలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సూర్యకుమార్ యాదవ్‌ను స్లెడ్జ్ చేసిన సంగతి విదితమే.
Also Read:
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆరోగ్యశ్రీ పరిధిలోకి పోస్ట్ కోవిడ్ చికిత్స..
ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
— Simran (@CowCorner9) November 7, 2020