AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెన్నై టీమ్‌ కోచ్‌ ఫ్లెమింగ్‌కు కోపం వచ్చింది…!

ఐపీఎల్‌లో వరుసగా మూడు ఓటమలు.. ఇలాంటప్పుడు ఆ టీమ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా ఉంటుంది..? చిరాకుగా ఉండదూ! సరిగ్గా ఇలాంటి చికాకునే ప్రదర్శించాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కోచ్‌...

చెన్నై టీమ్‌ కోచ్‌ ఫ్లెమింగ్‌కు కోపం వచ్చింది...!
Balu
|

Updated on: Oct 03, 2020 | 3:05 PM

Share

ఐపీఎల్‌లో వరుసగా మూడు ఓటమలు.. ఇలాంటప్పుడు ఆ టీమ్‌, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎలా ఉంటుంది..? చిరాకుగా ఉండదూ! సరిగ్గా ఇలాంటి చికాకునే ప్రదర్శించాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు కోచ్‌… బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ ధోనీ మరీ అంత కిందన రావడమేమిటని అడిగిన పాపానికి ఓ విలేకరిపై కస్సుబుస్సుమన్నాడు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌…అసలిది అంత ఇంపార్టెంట్‌ కొశ్చనా అంటూ ఎదురు ప్రశ్నించాడు.. మళ్లీ ఏమనుకున్నాడో ఏమో తమ టీమ్‌లో నాలుగో నంబర్‌ ప్లేస్‌ను కేదార్‌ జావద్‌కు కేటాయించామని జవాబిచ్చాడు.. రన్నరప్‌ హోదాలో బరిలో దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభ మ్యాచ్‌లో అదరగొట్టింది. ముంబాయిని మట్టికరిపించి టైటిల్‌ ఫేవరిట్‌ అనిపించుకుంది.. అయితే తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.. ఇలా వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడమన్నది 2014 తర్వాత ఇప్పుడే జరిగింది! టీమ్‌లో ఆటగాళ్లు అంతగా ఫామ్‌లో లేకపోవడం ఓ కారణమైతే… సీనియర్‌ ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ సరిగ్గా లేకపోవడం ఇంకో కారణం.. ఫైనల్‌ ఎలెవన్‌లో ఎవరికి చోటివ్వాలో తెలియని అయోమయ పరిస్థితి.. ఇవన్నీ కాకుండా కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మునుపటిలా వ్యూహాలు రచించకపోవడం ప్రధాన కారణం. పైగా ఆయనలో కాన్ఫిడెన్స్‌ పాలు కాసింత తగ్గినట్టుగా అనిపిస్తోంది.. సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌లు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైన తర్వాత విలేకరులతో చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ ముచ్చటించాడు.. ధోనీ కంటే ముందు కేదార్‌ జాదవ్‌ను ఎందుకు పంపించాల్సి వచ్చిందని ఓ విలేకరి అడిగాడు.. అదేం ముఖ్యమైన ప్రశ్నా అంటూ కోపగించుకున్నాడు ఫ్లెమింగ్‌. ఆ తర్వాత ఏదేదో చెప్పుకొచ్చాడు.. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోవచ్చని, టాప్‌ ఆర్డర్‌ రాణించిన సందర్భాలలో కేదార్‌ జాదవ్‌ను నంబర్‌ సెవన్‌లో పంపుతామని, అదే టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలితే జాదవ్ నంబర్‌ ఫోర్‌లో వస్తాడని ఫ్లెమింగ్ అన్నాడు.. ఫ్లెమింగ్‌ లాజిక్‌ ఏమిటో అక్కడున్నవారెవ్వరికి అర్థం కాకపోవడం కొసమెరుపు.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..