Coronavirus in India Update: భారత్ లో నిలకడగా సాగుతున్న కొత్త కరోనా కేసుల నమోదు.. గత 24గంటల్లో 13,965 పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో 13,052మంది కరోనా పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ..

Coronavirus in India live updates: భారత్ లో కరోనా వైరస్ కొత్త కేసుల నమోదు నిలకడగా సాగుతుంది. గత 24 గంటల్లో 13,052మంది కరోనా పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితులు 1,07,46,183లకు చేరుకున్నారు. ఇక గత 24గంటల్లో 127మంది కరోనాతో మరణించారు.. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,54,274లకు చేరుకుంది. ఇక ఒక్కరోజులో 13,965 మంది కరోనా నుంచి కోలుకున్నారని.. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,04,23,125 మంది కోలుకున్నారని తెలిపింది. దేశం మొత్తం మీద 1,68,784యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. దేశం మొత్తం రికవరీ రేటు 96.99 శాతానికి పెరిగింది. ఇక మరణాల రేటు 1.44 శాతంగా కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలోని అధికంగా కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు కరోనా నివారణకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఇస్తూనే మరోవైపు ఇతర దేశాలకు టీకా డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా టీకా తొలి డోసు అందిన వారి సంఖ్య 37,44,334కు చేరింది.
Also Read: ట్రైన్ వస్తున్నా బైక్ మీద పట్టాలు దాటడానికి ప్రయత్నించిన యువకుడు.. ఆపై