AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World wide Cool Winds: మరీ ఇంత దారుణమా?.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో..!

ఈ ఏడాది చలి మరీ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా, యూరప్, రష్యా, చైనాలో మంచు

World wide Cool Winds: మరీ ఇంత దారుణమా?.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటో..!
Shiva Prajapati
|

Updated on: Dec 29, 2020 | 9:43 PM

Share

World wide Cool Winds: ఈ ఏడాది చలి మరీ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా, యూరప్, రష్యా, చైనాలో మంచు తుఫానులు అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండే రష్యాలో పరిస్థితి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యధికంగా మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తాజగా అక్కడ ఉష్ణోగ్రతలకు అద్దం పట్టేలా ఉన్న రెండు ఫోటోలో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూస్తే అక్కడ పరిస్థితి ఏంటో ఇట్టే చెప్పేయొచ్చు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే.. ఓ వ్యక్తి గుడ్డను పగలగొట్టి సొనను ప్లేట్‌లో వేయబోయాడు. అయితే అ గుడ్డ సొన ప్లేటో పడే సమయంలోపే అది పూర్తిగా గడ్డకట్టిపోయింది. ఇక మరో ఫోటోలో అయితే దారుణం.. న్యూడిల్స్ ఎంతో ఇష్టంతో చేసుకున్నట్లున్నారు. పాపం బాక్స్ ఓపెన్ చేసి తిందాం అని స్పూన్‌తో నోటి వద్దకు తీసుకుంటుండగానే అవి కాస్తా గడ్డగట్టిపోయాయి. ఇలా గడ్గ గట్టిన గుడ్డు సొన, న్యూడుల్స్‌ను సదరు వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఆ ఫోటో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. మరి ఆ ఫోటోనూ మీరూ చూసి అక్కడ చలి తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అంచనా వేయండి.

Also read: