Women Safety Tips: ఈ వస్తువులు తప్పనసరిగా మహిళల హ్యాండ్ బ్యాగ్‌లో ఉండాలి.. ఎందుకంటే..
Women Safety Tips: మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే ను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది మిమ్మల్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షిస్తుంది. ఎవరైనా మీపై దాడి చేసినపపుడు వారి కళ్లలో పెప్పర్ స్ప్రే వేస్తే కొంత సమయం వరకు వారి కళ్లు కనిపించవు. ఆ సమయంలో మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు వీలుంటుంది. సురక్షితంగా ఉండేందుకు వీలుంటుంది. అయితే, నాణ్యమైన పెప్పర్ స్ప్రేని మాత్రమే కొనుగోలు చేయాలి.

Women Safety Tips: ఉద్యోగం, వ్యాపారం చేసే మహిళలు సాయంత్రం వేళ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో భద్రతపై తీవ్ర ఆందోళనకు గురవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి స్త్రీ తన పర్సులో ఖచ్చితంగా కొన్ని భద్రతాపరమైన వస్తువులను ఉంచుకోవాలి. అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..
1. మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్‌లో పెప్పర్ స్ప్రే ను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇది మిమ్మల్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు రక్షిస్తుంది. ఎవరైనా మీపై దాడి చేసినపపుడు వారి కళ్లలో పెప్పర్ స్ప్రే వేస్తే కొంత సమయం వరకు వారి కళ్లు కనిపించవు. ఆ సమయంలో మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు వీలుంటుంది. సురక్షితంగా ఉండేందుకు వీలుంటుంది. అయితే, నాణ్యమైన పెప్పర్ స్ప్రేని మాత్రమే కొనుగోలు చేయాలి.
2. పెప్పర్ జెల్ కూడా పెప్పర్ స్ప్రే మాదిరిగానే పని చేస్తుంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే.. దూరం నుంచి కూడా దీని ప్రభావం చూపుతుంది. కొంచెం దూరం నుంచి స్ప్రే చేసినా.. ప్రభావం గణనీయంగా ఉంటుంది.
3. మహిళలు తమ భద్రత కోసం లేటర్ టార్చ్‌ను కూడా ఉపయోగించొచ్చు. ఒక వ్యక్తి కళ్లపై లేజర్ టార్చ్ ప్రయోగిస్తే.. అది కొంత సమయం వరకు వారి కళ్లు కనిపించకుండా చేస్తేంది. ఆ గ్యాప్‌లో మహిళలు ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
4. ఫోల్డింగ్ ఐరన్ రాడ్‌ను కూడా మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. ఎవరైనా మీపై అటాక్ చేసినప్పుడు.. మీరు వారిపై దాడి చేయొచ్చు. తద్వారా మీరు సురక్షితంగా ఉండొచ్చు.
5. స్టన్ గన్ కూడా మహిళలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఎలక్ట్రానిక్ తుపాకీ. దీనిని నొక్కినప్పుడు ముందు వైపు నుంచి రెండు వైర్లు బయటకు వస్తాయి. దాడి చేసే వ్యక్తిని ఆ వైర్లు చుట్టేస్తాయి. వాటిని విడిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లోనే మీరు సురక్షితంగా బయటపడొచ్చు.
6. సేఫ్టీ అలారం కూడా మహిళ భద్రతకు ఉపయుక్తంగా ఉంటుంది. వీటి నుంచి చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఎంత శబ్దం అంటే.. ఎదుటి వ్యక్తి ఆ శబ్దం వింటేనే భయపడిపోతారు. దాని ధ్వని ఇతరులను అలర్ట్ చేసేలా ఉంటుంది. అలా ప్రమాదం నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
