Keyboard: కీ బోర్డ్‌పై ఉండే ఈ సింబల్స్‌.. అసలు ఉద్దేశం ఏంటో తెలుసా.?

కీ బోర్డ్ పై కనిపించే ఈ రెండు సింబల్స్ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. కీ బోర్డ్ లోని F, J కీలపై ఒక చిన్న గీత ఆకారంలో సింబల్ ఉంటుంది. ఇంతకీ ఈ సింబల్ ను ఎందుకు ఏర్పాటు చేశారు.? అసలు దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటి.? ఇవి ఎందుకు ఉపయోగపడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Keyboard: కీ బోర్డ్‌పై ఉండే ఈ సింబల్స్‌.. అసలు ఉద్దేశం ఏంటో తెలుసా.?
Keyboard
Follow us

|

Updated on: Oct 21, 2024 | 11:54 AM

ఒకప్పుడు కేవలం గ్రాడ్యుయేషన్‌ స్టేజ్‌లో ఉండే వారు మాత్రమే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం స్కూల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వీటిని ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతీ పనికి ప్రస్తుతం కంప్యూటర్‌ వినియోగం అనివార్యంగా మారిందని చెప్పాలి. అయితే ఇందులో మనకు తెలియని ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఉపయోగించే ప్రతీ కంప్యూటర్‌ కీబోర్డ్‌పై ఉండే ‘F’, ‘J’ లెటర్స్‌పై చిన్న సింబల్ ఉంటుంది. ఇంతకీ ఈ సింబల్‌ ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ల్యాప్‌టాప్‌కి ఉండే కీ బోర్డ్‌లో కూడా ఇదే సింబల్‌ ఉంటుంది. అయితే ఈ సింబల్‌ ఏర్పాటు చేయడం వెనకాల ఒక బలమైన కారణం ఉందడోయ్‌. ఇంతకీ ఈ సింబల్స్‌ ముఖ్య ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ సింబల్స్‌కి ముఖ్య ఉద్దేశం టైపింగ్‌ కోసమే. కంప్యూటర్ కీబోర్డ్‌లో ఈ రెండు బటన్స్‌ సరిగ్గా మధ్యలో ఉంటాయి. టైపింగ్‌ వచ్చిన వారు ఎవరైనా తమ రెండు చేతుల చూపుడు వేళ్లను ఈ రెండు లెటర్స్‌పై ఉంచే టైపింగ్ చేస్తుంటారు. కీ బోర్డ్‌లోని అన్ని బటన్స్‌.. ఈ F,J బటన్స్‌కి సమాన దూరంలో ఉంటాయి. ఇవి టైపింగ్‌ సులభంగా చేయడానికి దోహదపడతాయి.

అంతేకాకుండా టైపింగ్‌ నేర్చుకునే సమయంలో ఏడమ చేతి వైపున్న అక్షరాలను, కుడి చేతు వైపు ఉండే బటన్స్‌ను అంచనా వేస్తూనే టైపింగ్ ప్రాక్టీస్‌ చేస్తుంటారు. ఇది టైపింగ్ వేగాన్ని పెంచడంతో పాటు, పర్‌ఫెక్షన్‌ను అందిస్తుంది. ఇక కీబోర్డ్‌ పై నుంచి చేయి తీసిన ప్రతీసారి ఈ రెండు లెటర్స్‌ కోసం వెతుక్కునే పని లేకుండా ఉండేందుకు ఈ సింబల్స్‌ని ఏర్పాటు చేశారు. దీంతో రెండు వేళ్లు నేరుగా F, J లెటర్స్‌పైకి వెళ్తాయి. టైప్‌ రైటర్‌ ఉపయోగిస్తున్న రోజుల నుంచి ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఇదండీ కీ బోర్డులపై ఉండే ఈ సింబల్‌ అసలు కారణం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ