Black Apples: అరుదైన బ్లాక్ యాపిల్ ధర తెలిస్తే షాకే.. వీటిని ఎక్కడ సాగుచేస్తారంటే..?
Black Diamond Apple Benefits: రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే యాపిల్‌ను చిన్నారులు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. సహజంగా యాపిల్ 3-4 రంగుల్లో మనం చూసే ఉంటాం.. అవి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు/పసుపు రంగుల్లోని యాపిల్స్. అయితే మనకు తెలియని, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇతర రంగుల్లో కూడా యాపిల్ పండ్లు ఉంటాయి. మరి బ్లాక్ యాపిల్స్ గురించి మీకు తెలుసా? వాటిని ఎక్కడ సాగుచేస్తారు?

Black Apple Price: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది రోజూ తీసుకునే ఫ్రూట్స్‌లో యాపిల్ కూడా అగ్రస్థానంలో ఉంటుంది. యాపిల్ పండ్లలో పోషక విలువలు పుష్కలంగా ఉండటమే దీనికి కారణం. అందుకే మంచి ఆరోగ్యం కోసం రోజూ యాపిల్ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. సహజంగా యాపిల్ 3-4 రంగుల్లో మనం చూసే ఉంటాం.. అవి ఎరుపు, ఆకుపచ్చ, బంగారు/పసుపు రంగుల్లోని యాపిల్స్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే యాపిల్‌ను చిన్నారులు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మనకు తెలియని, ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇతర రంగుల్లో కూడా యాపిల్ పండ్లు ఉంటాయి. మనకు అవి అందుబాటులో లేకపోయినా.. ఇతర దేశాల్లో లభిస్తుంటాయి. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప.. మన దేశంలో అవి కనిపించవు.
ఇలా బ్లాక్ యాపిల్స్ కూడా లభిస్తాయంటే మనకు ఆశ్చర్యం కలిగించడం సహజమే. పోషక విలువలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. యాపిల్ వరైటీల్లో బ్లాక్ డైమండ్ యాపిల్ చాలా ప్రత్యేకమైనది. వీటిని అబ్సిడియన్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి చాలా ఖరీదైనవి కూడా.. టిబెట్ పర్వత ప్రాంతాల్లో వీటిని సాగుచేస్తారు. వీటికి పైన నల్ల రంగులో ఉన్నా.. లోపలి భాగం మాత్రం సాధారణ యాపిల్‌లానే తెల్లగా ఉంటుంది.
బ్లాక్ డైమండ్ యాపిల్..
Due to the larger amount of glucose that they contain, black diamond apples, which are a subtype of the Hua Niu apple, are very clear and sweet. pic.twitter.com/24NH2QbkdV
— Chinaza (Nightwears) (@NwaAdaIgbo1) November 16, 2023
ఆకర్షణీయమైన రూపానికి తగ్గట్టే బ్లాక్ డైమండ్ యాపిల్ ఎన్నో రకాల రోగాలను కూడా నయం చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియ బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ, యాంటీ యాక్సిడెంట్లు, ఇతర విటమిన్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. పలు రకాల యాపిల్ వరైటీల్లో ఈ అరుదైన రకం పళ్లను సాగచేయడం చాలా వ్యయంతో కూడుకున్నది. అందుకే మార్కెట్‌లో వీటి ఖరీదు కూడా ఎక్కువ. వీటి ధర ఒక్కోటి రూ.500 వరకు ఉంటుంది. అందుకే సంపన్న వర్గాలతో పాటు కొత్త రకం ఫ్రూట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేసే పండ్ల ప్రియులు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తుంటారు.
ప్రత్యేకమైన వర్ణంలోని యాపిల్ కావడంతో పాటు నిగనిగలాడుతూ కనిపించే ఈ పండు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వీటిని సాగుచేసేందుకు అయ్యే ఖర్చు కూడా మిగిలిన వాటితో పోలిస్తే చాలా ఎక్కువ. నాణ్యత విషయంలో వీటి సాగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సహజంగా ఇతర యాపిల్ వరైటీలు రెండు, మూడేళ్లకే కాపుకు వచ్చేస్తాయి. అయితే బ్లాక్ డైమండ్ యాపిల్స్ మాత్రం కాపుకు రావాలంటే 8 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. అప్పటి వరకు వాటి పోషణకు చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే వీటి రవాణా ఖర్చులను కలుపుకుని ఒక్కోటి రూ.500లకు మార్కెట్లో విక్రయిస్తున్నారు.




