Kitchen Tips: వంటింట్లో ఈ చిట్కాలు పాటించి చూడండి.. మీ పని చాలా ఈజీ అవుతుంది.

ఇంట్లో వంటింటికి ఉండే ప్రాధాన్యతే వేరు. రకరకాల వంటకాలు చేసుకుంటుంటారు. అయితే వంట చేయడం ఎంత సులభమో, చేసిన వంట టేస్టీగా కావడం, వంట ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం కష్టంతో కూడుకున్న విషయాలు. అయితే కొన్ని రకాల వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా వంటింట్లో మహిళల పని మరింత సులభతరం...

Kitchen Tips: వంటింట్లో ఈ చిట్కాలు పాటించి చూడండి.. మీ పని చాలా ఈజీ అవుతుంది.
Kitchen Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2023 | 5:10 PM

‘కోటి విద్యలు.. కూటి కొరకే’ అంటారు. అంటే ఏ పని చేసినా కడుపు నింపుకునేందుకే అని అర్థం. అందుకే ఇంట్లో వంటింటికి ఉండే ప్రాధాన్యతే వేరు. రకరకాల వంటకాలు చేసుకుంటుంటారు. అయితే వంట చేయడం ఎంత సులభమో, చేసిన వంట టేస్టీగా కావడం, వంట ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం కష్టంతో కూడుకున్న విషయాలు. అయితే కొన్ని రకాల వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా వంటింట్లో మహిళల పని మరింత సులభతరం అవుతుంది. అలాంటి కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* సాధారణంగా ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఇందుకోసం ఫ్రిడ్జ్‌లో ఉంచుతుంటారు. అయితే ఫ్రిడ్జ్‌లో కూల్‌ ఎక్కువైన సందర్భాల్లోనూ ఆకు కూరలు పాడైపోవడాన్ని గమనించే ఉంటాం. అయితే ఓ చిన్న చిట్కా ద్వారా ఆకు కూరలను చాలా కాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చు. తడి టవ్‌లో కూరగాయలను ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

* ఇంట్లో రసగుల్లా చేయాలనుకుంటే పాలలోనీ మీగడను మొత్తం తీసివేయాలి. రసగుల్ల కోసం ఉపయోగించే పాలలో ఎలాంటి మీగడ లేకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల రసగుల్లాలు మరింత మెత్తగా, జ్యూసిగా అవుతాయి.

* చలికాలంలో వేడివేడిగా సమోసాలు చేసుకోవాలనుకుంటున్నారా.? అయితే సమోసాల తయారీకి ఉపయోగించే పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలపండి. ఇలా చేయడం వల్ల సమోసాలు క్రిస్పీగా టేస్టీగా తయారవుతాయి.

* పచ్చి మిరపకాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. వాటిని ఫ్రిడ్జిలో ఉంచే ముందు మిరపకాయల తొడిమెలను తొలగించాలి. ఇలా చేయడం వల్ల పచ్చి మిర్చి తాజాగా ఉంటుంది.

* టమాటా చట్నీ తయారు చేసుకునేప్పుడు.. అందులో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల చట్నీ మరింత టేస్టీగా అవుతుంది.

* పాల నుంచి నెయ్యి తయారు చేయాలనుకునే వారు. పాల నుంచి క్రీమ్‌ తీసే ముందు పాలను బాగా మరిగించాలి. అనంతరం ఒక 5 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. ఆ తర్వాత పాలల ఎక్కువ మొత్తం క్రీమ్‌ తయారవుతుంది. దీంతో మీరు ఎక్కువ క్రీమ్‌ను పొందొచ్చు.

* నిమ్మకాయం పచ్చడి పాడవుతున్నట్లు భావన కలిగితే అందులో కొంచెం వెనిగర్ వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయ పచ్చడి చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

* అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత.. అందులో ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీ స్ఫూన్‌ వేడి నూనె వేసి బాగా కలపాలి. ఇలా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

* ఉల్లిపాయను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేయండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా తర్వగా పూర్తవుతుంది.

* ఆమ్‌ పన్నా డ్రింక్‌.. నార్త్‌ ఇండియాలో ఎక్కువగా ఈ డ్రింక్‌ను చేసుకుంటారు. పచ్చి మామిడి కాయలతో చేసే జ్యూస్‌లో 4 నుంచి 5 స్పన్ల అల్లం రసం కలుపుకుంటే జ్యూస్‌ మరింత రుచిగా అవుతుంది. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!