వామ్మో.. ఏనుగు కలలో కనిపించిందా..? త్వరలో మీకు జరిగేది ఇదేనట..!
సాధారణంగానే మనందరికీ కలలు రావటం సహజం. అయితే, కొందరికీ కలలో పర్వతాలు .. నదులు .. అడవులు .. జంతువులు కనిపిస్తుంటాయి. అలాంటి కలల్లో అప్పుడప్పుడు పులులు .. సింహాలు, ఏనుగులు కూడా కనిపిస్తుంటాయి. అలాంటి జంతువులు కలలో కనిపించినప్పుడు సాధారణంగానే భయపడుతుంటారు. కొందరు ఆ కలను మరుసటి రోజు ఉదయం ఇతరులతో పంచుకుంటారు. మరికొందరు ఎదుటివారికి చెబితే ఏం జరుగుతుందోననే ఆందోళనకి లోనవుతుంటారు. అయితే కలలో ఏనుగు కనిపిస్తే ఏమౌతుందో తెలుసా..?
Updated on: May 03, 2025 | 6:09 PM

స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు అనేది కొన్ని సంకేతాలను తెలియజేస్తాని చెబుతారు. ఆయా కల ఆధారంగా మంచి, చెడు అంచనా వేస్తారు. కొందరికి కలలో ఏనుగు తరచుగా కనిపిస్తుంది. అయితే మీకు కలలో ఏనుగు వస్తే, మీ దశ తిరగనుందని అర్థం అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని అంటున్నారు.

కలలో ఏనుగు కనిపించటంతో ఏదో విధంగా మీకు ధనలాభం గోచరిస్తుందని అర్థం అంటున్నారు నిపుణులు. ఇలాంటి కలలు రావటం అంటే మీరు త్వరగా ధనవంతులు కాబోతున్నారని సంకేతం అంటున్నారు. లేదా మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని ముందుగా మీకు అందుతున్న శుభ సంకేతం అంటున్నారు.

కలలో ఏనుగు కనిపిస్తే మంచిదేనని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏనుగు కుంభస్థలం .. లక్ష్మీదేవి నివాస స్థానంగా చెబుతారు. అందువలన కలలో ఏనుగు దర్శనం వలన సంపదలు లభిస్తాయని అంటారు. ఏనుగును దర్శించుకోవడం వలన దారిద్య్రం .. దుఃఖం దూరమవుతాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కలలో ఏనుగు కనిపించటం వల్ల వారి జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని అంటున్నారు. వారికి జీవితలో అదృష్టం, ఐశ్వర్యం చేకూరతాయని నమ్ముతారు. అంతేకాదు.. ఏనుగును గజరాజు అంటారు. ఆ సాక్ష్యాత్తు ఆ వినాయకుడి ముఖం కూడా ఏనుగు. అందుకే కలలో ఏనుగు కనిపిస్తే అదృష్టంగా చెబుతారు.

అంతేకాదు.. ఆయా పుణ్య క్షేత్రాల్లో గజ వాహనంగా ఏనుగులు భగవంతుడి సేవలో తరిస్తుంటాయి. గజ ముఖంతోనే వినాయకుడు తొలి పూజలు అందుకుంటూ ఉంటాడు .. అందరి విఘ్నాలను తొలగిస్తూ ఉంటాడు. అలాంటి ఏనుగును కలలోనే కాదు .. బయట చూసినా ఆ ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుందని నమ్ముతారు.




