కొండచిలువ పొట్ట కోసిన సైంటిస్టులు.. లోపల కనిపించిన దృశ్యం చూడగా.. ధైర్యముంటేనే వీడియో చూడండి..

పైథాన్ పొట్ట ఉబ్బిపోయి ఉండటం గుర్తించారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు.. అంతే! కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా కంగుతిన్నారు.

కొండచిలువ పొట్ట కోసిన సైంటిస్టులు.. లోపల కనిపించిన దృశ్యం చూడగా.. ధైర్యముంటేనే వీడియో చూడండి..
Python Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 10, 2022 | 7:00 PM

ఓ అటవీ ప్రాంతంలో చలనం లేని పైథాన్‌ను ల్యాబ్‌కు తీసుకొచ్చారు కొంతమంది సైంటిస్టులు. అప్పటికే అది చచ్చిపోయిందని గ్రహించిన వాళ్లు.. దాని పొట్ట ఉబ్బిపోయి ఉండటం గుర్తించారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు.. అంతే! కనిపించిన దృశ్యానికి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

సరీసృపాలలో అత్యంత ప్రమాదకరమైనవి కొండచిలువలు. అవి భారీ ఆకారంలో ఉండటమే కాదు.. సైజులో పెద్దగా ఉండే జంతువులు వేటినైనా అమాంతం మింగేస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ కొండచిలువలు పెద్ద పెద్ద జంతువులను చుట్టేసి.. వాటిని ఊపిరి ఆడకుండా చేసి.. మింగేస్తాయి. అయితే అప్పుడప్పుడూ ఇలాంటివే కొండచిలువలు ప్రాణాలు విడిచేలా చేస్తాయి. అవి మింగే పెద్ద జంతువులను జీర్ణించుకోలేక, బయటికి కక్కలేక.. చివరికి మృత్యువడిలో చేరతాయి. అలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది.

సుమారు 18 అడుగులు ఉన్న ఓ బర్మీస్ పైథాన్.. జింకలు, కుందేళ్లు లాంటివి మింగకుండా.. ఏకంగా ఐదడుగులు పొడవున్న భారీ మొసలిని మింగేసింది. చివరికి కక్కలేక.. జీర్ణించుకోలేక.. ప్రాణాలు విడిచింది. కాగా, దాన్ని చూసిన కొంతమంది సైంటిస్టులు.. కొండచిలువను ల్యాబ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే అది చచ్చిపోయిందని గ్రహించిన వాళ్లు.. దాని పొట్ట ఉబ్బిపోయి ఉండటం గుర్తించారు. కొండచిలువ ఏం మింగేసి ఉంటుందోనని దాని పొట్ట కోసి చూశారు. ఫ్లోరిడా ల్యాబ్‌లో కొండచిలువ పొట్టలో నుంచి మొసలిని తీస్తున్న దృశ్యాలు సైంటిస్టులు ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.