Watch: పొలం పనుల్లో రైతులు.. పొదల మాటున వింత శబ్ధాలు.. తీరా చూస్తే..!
రైతులు తమ పంటపొలంలో పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతో పెద్దపెద్ద వింత శబ్దాలతో ఓ ప్రాణి పొదల్లో నుండి వారిపైకి దూసుకు వస్తుంది. వింత శబ్దాలతో తమవైపు వస్తున్న ఆ ప్రాణి ఏంటో తెలియక భయంతో ఒకసారి ఉలిక్కిపడ్డారు రైతులు. ఆ తరువాత కొద్ది క్షణాలకు తేరుకుని చూసేసరికే అప్పటికే వారి ముందు 15 అడుగుల పొడవుతో నల్లని మచ్చలతో భయంకరంగా పడగ విప్పి బుసలుకొడుతూ తమ ముందు ప్రత్యక్షమైంది ఓ గిరినాగు.

రైతులు తమ పంటపొలంలో పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతో పెద్దపెద్ద వింత శబ్దాలతో ఓ ప్రాణి పొదల్లో నుండి వారిపైకి దూసుకు వస్తుంది. వింత శబ్దాలతో తమవైపు వస్తున్న ఆ ప్రాణి ఏంటో తెలియక భయంతో ఒకసారి ఉలిక్కిపడ్డారు రైతులు. ఆ తరువాత కొద్ది క్షణాలకు తేరుకుని చూసేసరికే అప్పటికే వారి ముందు 15 అడుగుల పొడవుతో నల్లని మచ్చలతో భయంకరంగా పడగ విప్పి బుసలుకొడుతూ తమ ముందు ప్రత్యక్షమైంది ఓ గిరినాగు. దీంతో ఒక్కసారిగా చూసిన రైతులు పరుగు అందుకున్నారు.
పొలం పనుల్లో ఉన్న తమకు అకస్మాత్తుగా ఎదురైన గిరినాగు ఘటన ఒక్కసారిగా బెంబేలెత్తించింది. తమ ముందు బుసలు కొడుతూ ప్రత్యక్షమైన గిరినాగు బారి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని రైతులు పరుగుపరుగున అక్కడ నుండి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పాము కూడా ఆ అలజడికి వారిని కొంతదూరం వెంబడించింది. దీంతో రైతులు ధైర్యం తెచ్చుకుని కొంతదూరం వెళ్లిన తరువాత వెనుదిరిగి చూశారు. అయితే పాము ఏ మాత్రం తగ్గకుండా బుసలు కొడుతూ ఎగిరెగిరి పడుతూ హాల్ చల్ చేస్తూనే ఉంది.
ఇదంతా గమనిస్తున్న ప్రక్క పొలాల్లోనే మరికొందరు రైతులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంభీరంగా విరుచుకుపడుతున్న పదిహేను అడుగుల గిరినాగును నిలువరించాలి అని తీవ్ర చర్చ, ఆందోళనలు రైతుల మధ్య నెలకొన్నాయి. కొందరు కొట్టి చంపుదామని అంటుంటే, మరికొందరు వద్దు.. వద్దు.. మన ముందున్న పాము సాక్షాత్తు శివుడి మెడలో ఉండే నాగుపాము ప్రతిరూపం, అలాంటి పామును చంపి మనం పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. అప్పటికే అరగంట అవుతుంది.
మరోవైపు గిరినాగు క్షణక్షణానికి రెచ్చిపోయి ప్రవర్తిస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే తమ ప్రాణానికి హాని జరుగుతుందని భావించి ప్రక్క గ్రామమైన కొప్పులవానిపాలెంకు చెందిన కృష్ణ అనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చి తొందరగా రావాలని కోరారు. అలా స్నేక్ క్యాచర్ వచ్చే వరకు రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇంతలో స్నేక్ క్యాచర్ కృష్ణ వచ్చి గిరినాగును చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత కృష్ణ ప్రక్కనే ఉన్న కొండ ప్రాంతంలో వదిలిపెట్టి గిరినాగును కాపాడాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
వీడియో చూడండి..
విజయనగరం జిల్లా వేపాడ మండలం చినదుంగాడ శివారు కొమ్మునేని కృష్ణ సన్యాసినయుడు పంట పొలాల్లో జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రాంతమంతా కొండవాలు ప్రాంతం కావడంతో పాటు గిరినాగులు అధికంగా సంచరించే ప్రాంతం కూడా ఇదే కావడం విశేషం. గిరినాగులు వాతావరణ పరిస్థితులు బట్టి తరుచూ కొండ ప్రాంతం నుండి మైదాన ప్రాంతంకు వచ్చి రైతుల చేతిలో ప్రాణాలు తీసుకుంటున్నాయి అంటున్నారు స్నేక్ క్యాచర్ కృష్ణ. గిరినాగు వంటి అరుదైన పాము జాతులను పర్యావరణ సమతుల్యత కోసం కాపాడటం అవసరమని, దయజేసి ఎవరూ చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు స్నేక్ క్యాచర్.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..