Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: రోడ్డుపై పసుపు, కుంకుమ ఆనవాళ్లు.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో దెబ్బకు షాక్!

బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోగి దిగిన పోలీసులు.. కుట్ర మొత్తాన్ని బయటపెట్టారు. విజయ్ కుమార్, మణికంఠ, చిట్టినేని అరుణ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మరో కుటుంబం కూడా ఇన్‌వాల్వ్ అయ్యినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: రోడ్డుపై పసుపు, కుంకుమ ఆనవాళ్లు.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో దెబ్బకు షాక్!
Black Magic Ritual
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 07, 2025 | 10:40 AM

కృష్ణా జిల్లా చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ముఠాగా ఏర్పడి ప్రజా ప్రతినిధులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మాయాగాళ్ల గుట్టురట్టు చేశారు పోలీసులు. క్షుద్రపూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టే గ్యాంగ్‌ను ఉయ్యూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు

చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన తెలుగు దేశం పార్టీకి చెందిన యెనిగండ్ల కుటుంబరావు, వైసీపీకి చెందిన పాలడుగు శివజ్యోతి రాజకీయ ప్రత్యర్థులు. గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుటుంబరావు భార్య సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ క్రమంలో చేతబడి చేయించి ప్రత్యర్థిని చంపాలని శివజ్యోతి పన్నాగం పన్నారని ఆరోపించారు కుటుంబరావు కుటుంబసభ్యులు. ఇందుకోసం విజయకుమార్ అనే వ్యక్తిని ఆశ్రయించారు. దీంతో లంకె మణికంఠ స్వామితో క్షుద్రపూజలు చేయించాలని ఇద్దరూ ప్లాన్ చేశారు. ఇందుకోసం విజయ్‌కుమార్‌కు 13 లక్షలు, మణికంఠస్వామికి శివజ్యోతి 2 లక్షల రూపాయలు ఇచ్చారని కుటుంబరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కుటుంబరావు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోగి దిగిన పోలీసులు.. కుట్ర మొత్తాన్ని బయటపెట్టారు. విజయ్ కుమార్, మణికంఠ, చిట్టినేని అరుణ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కుటుంబరావు ప్రత్యర్థులు చిట్టినేని అరుణ కుటుంబం కూడా ఇన్‌వాల్వ్ అయ్యినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇలాంటి మూఢనమ్మకాలను మోసపోవద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తన్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..