Lottery: నక్క తోక తొక్కావ్ బాసూ.. దుబాయ్‌లో రాత్రికి రాత్రే ధనవంతుడైపోయిన భారతీయుడు.. ఏకంగా..
UAE Draw FAST5: దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న ఆదిల్ ఖాన్ యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్ మనీ ‘ఫాస్ట్ 5’ లాటరీని కొనుగోలు చేశాడు. ఆ లాటరీలో ఆదిల్‌ఖాన్ విజేతగా నిలిచింది. ఈ లాటరీ ప్రకారం.. ఆదిల్ ఖాన్ ప్రతి నెలా 25,000 దిర్హమ్‌లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 5.60 లక్షలు చొప్పున 25 సంవత్సరాల పాటు పొందనున్నాడు. ఈ మేరకు లాటరీ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశాడు. లాటరీ గెలిచిన విషయం తెలిసిన ఆదిల్ ఖాన్,,,

UAE Draw FAST5: అదృష్ట దేవత ఎప్పుడో ఒకసారి తలుపు తడితే.. దురదృష్టం తలుపు తీసిందాకా తడుతూనే ఉంటుందట. కానీ, అదృష్టం తలుపు తట్టినప్పుడే మీరు ఓపెన్ చేస్తే.. మీ పంట పండినట్లే. ఇదే పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. పూట గడవక ఉపాధి కోసం విదేశాలకు వెళితే.. ఊహించని రీతిలో అదృష్టం వరించింది. అతను ఏ పని చేయాల్సిన అవసరం లేకుండానే నెలకు రూ. 5.60 లక్షలు పొందే జాక్‌పాట్ కొట్టేశాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ జాక్‌పాట్ కొట్టేశాడు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దామా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆదిల్ ఖాన్‌కు స్థానికంగా పని దొరక్కపోవడంతో ఉపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అయితే, అక్కడ ఆయనకు పనితో పాటు అదృష్టం కూడా వరించింది. దాంతో అతను రాత్రికి రాత్రే ధనవంతుడు అయ్యే అవకాశం లభించింది. దుబాయ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న ఆదిల్ ఖాన్ యూఏఈ నిర్వహించిన మెగా ప్రైజ్ మనీ ‘ఫాస్ట్ 5’ లాటరీని కొనుగోలు చేశాడు. ఆ లాటరీలో ఆదిల్‌ఖాన్ విజేతగా నిలిచింది. ఈ లాటరీ ప్రకారం.. ఆదిల్ ఖాన్ ప్రతి నెలా 25,000 దిర్హమ్‌లు అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ. 5.60 లక్షలు చొప్పున 25 సంవత్సరాల పాటు పొందనున్నాడు. ఈ మేరకు లాటరీ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశాడు. లాటరీ గెలిచిన విషయం తెలిసిన ఆదిల్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. తమ సమస్యలు తీరిపోయాయ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజమే కదా.. అదృష్టం అంటే ఇదే కదా..!




మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..