జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరికీ ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది. ఇది అందరకీ తెలిసందే. కానీ, అమెరికాలో మాత్రం రెండు సార్లు తల్లి కడుపు నుంచి అదే బిడ్డ పుట్టడం ఆశ్చర్యాని కలిగిస్తోంది. వైద్య శాస్త్రంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయని, అందులో ఇది కూడా ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి ప్రసవం తర్వాత, వైద్యులు శిశువును తిరిగి తల్లి కడుపులో ఉంచారు. మరలా 11 వారాల తర్వాత ఆ తల్లి మరోసారి అదేపాపకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఈ తల్లి ఒకే బిడ్డకు రెండుసార్లు జన్మనిచ్చిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ వార్త నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. చిన్నారి వెన్నెముకలో సమస్య ఉందని, పుట్టకముందే వైద్యులు ఆపరేషన్ చేశారంట.
ఫ్లోరిడాకు చెందిన జాడెన్ ఆష్లే అనే వ్యక్తి కడుపులో ఉన్న శిశువుకు వెన్నుముక సమస్య ఉందని తెలిసింది. అది సరిదిద్దకపోతే పాప ప్రాణం కూడా పోతుందని తెలిసింది. దీని తర్వాత, జేడెన్ ప్రత్యేక వైద్యుల బృందాన్ని సంప్రదించింది. ఆ డాక్టర్లు ఇంకా పూర్తిగా డెవలప్ కాకుండా ఉన్న మగబిడ్డను తల్లి గర్భం నుంచి ఆపరేషన్ చేసి తొలగించారు. మరోసారి ఆపరేషన్ చేసి మళ్లీ తల్లి కడుపులో ఉంచారు. 2 నెలల ఆపరేషన్ చేసి తిరిగి అదే శిశువును బయటకు తీశారు. పుట్టిన ఆ మగబిడ్డకు వెన్నుపూస కూడా సక్రమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
తల్లి కడుపులోకి వచ్చిన రెండు నెలల తర్వాత మరోసారి ఈపాప జన్మించింది. ప్రస్తుతం ఆపాప వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ప్రస్తుతం తల్లీబిడ్డలను వైద్యులు తమ పర్యవేక్షణలోనే ఉంచారు. త్వరలో ఇద్దరూ తమ ఇంటికి వెళ్లారు. టిక్‌టాక్‌లో వీడియోను పంచుకోవడం ద్వారా జాడెన్ యాష్లే ఈ అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. పిండ దశలో ఉన్నప్పుడు ఏవైనా లోపాలు ఉంటే శస్త్రచికిత్స చేసి, పుట్టబోయే బిడ్డ వైకల్యాలు సరిచేయవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు.
చాలా సార్లు, బిడ్డ పుట్టిన తర్వాత ఏదో పుట్టుకతో వచ్చే వైకల్యంతో బాధపడుతున్నట్లు గుర్తించామని, దీంతో పిల్లలతోపాటు తల్లిదండ్రుల జీవితం కష్టంగా మారుతుందని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెన్ ఫీటల్ సర్జరీ ఓ వరం లాంటిది. ఇందులో బిడ్డ పుట్టకముందే శస్త్రచికిత్స చేస్తారు. పిండం పుట్టకముందే అభివృద్ధి చెందలేదు. ఈ విధంగా దాని లోపాటను నిరోధించడం లేదా తగ్గించడం సాధ్యమవుతుంది. ఈ ఆపరేషన్ చాలా కష్టం అయినప్పటికీ, నిపుణులైన వైద్యుల బృందం తమ పర్యవేక్షణలో ఇలాంటి ఆపరేషన్‌లు చేస్తారు.
Also Read: Knowledge: స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు చెమట వస్తుంది కానీ స్వీట్ తిన్నప్పుడు రాదు.. కారణం ఏంటో తెలుసా..?