Ancient Human Beings: ఆ ఊర్లో ఆదిమానవుడి జాడలు.. ఆసక్తి రేపుతోన్న అక్కడి సమాధులు

|

Aug 06, 2021 | 5:48 PM

ఇది టెక్నాలజీ శకం ..మనం అంతరిక్షం వైపు చూస్తున్నాం..క్యాష్‌ వుంటే చాలు ఎవరైనా సరే ఇలా వెళ్లి అలా అంతరిక్షాన్ని చుట్టేసి రావచ్చు . పైగా పల్లె వెలుగు

Ancient Human Beings: ఆ ఊర్లో ఆదిమానవుడి జాడలు.. ఆసక్తి రేపుతోన్న అక్కడి సమాధులు
Ancient Human Beings
Follow us on

ఇది టెక్నాలజీ శకం ..మనం అంతరిక్షం వైపు చూస్తున్నాం..క్యాష్‌ వుంటే చాలు ఎవరైనా సరే ఇలా వెళ్లి అలా అంతరిక్షాన్ని చుట్టేసి రావచ్చు . పైగా పల్లె వెలుగు బస్సులా ఇప్పుడు స్పేష్‌ షటిల్స్‌ రెడీ మేడ్‌.. అంతరిక్ష యానం.. అభివృద్ధి వెలుగులు సరే.. మనకు తెలియని మన చరిత్ర ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. చూస్తే..వింటే..వింత అనుభూతినిస్తోంది.  మానవచరిత్ర ఎక్కడ మొదలయ్యామంటే మొదటగా ఎవరికైనా గుర్తొకు వచ్చే వ్యక్తి డార్విన్‌ తాత. అరటిపండు వలచినట్టు మానవ పరిణామక్రమాన్ని భావితరాల కళ్లకు కట్టారాయన.  నాలుగు కాళ్లపై నడిచిన వ్యక్తి.. ..ఆకలి నేర్పిన పాఠంతో చేతుల్ని ఆయుధంగా చేసుకోని…ఆయుధాలను సమకూర్చుకొని ..రాయి-రాయిని కొట్టి నిప్పును పసిగట్టి..అడుగు ముందుకు వేయడమే..నవ శకానికి పునాది రాయి.

ఆది మానవులు ఎలా వుండేవాళ్లో.. నాగరికత ఎలా పరిణామం చెందిందో పుస్తకాల్లో చదువుకోవడం..ఇలా సినిమాల్లో ..డాక్యుమెంటరీల్లో చూడ్డం..మాములే. కానీ కాలాలు మారినా..తరాలు మారినా.. నేటికీ ఆదిమానవుల జాడలు ఇంకా వున్నాయా? తరాలు కనుమరుగైనా చరిత్ర కనుమరుగుకాదు..పూర్వీకులను మనం మరిచినా సరే రాళ్లు రప్పలు మాత్రం చరిత్రను తమ గుండె గుడిలో పదిలంగా భద్రపర్చుకుంటాయి. అందుకు నిదర్శనమే ఈ శిలా ఆవేదన. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న మనుషుల్లారా మీ మూలాలను తెలుసుకోరేం?..అంటూ ప్రశ్నిస్తున్నట్టుగా వున్న అక్కడ సమాధులు ఉన్నాయి.వీటిచరిత్ర ముందు ఈజిప్ట్‌ మమ్మీలు కూడా డమ్మీలే.

ఖమ్మం జిల్లా అడవుల్లో రాకాసి పట్టణంలోని ఈ  రాక్షస గూళ్లుకు వేల ఏళ్ల చరిత్ర వుంది. ఈ ప్రాంతం విశిష్టతను టీవీ9 ఇటీవల వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కదంబాపూర్‌లో మనకు తెలియని మన చరిత్రను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా మీ కళ్ల ముందుకు తెస్తోంది.
ఖమ్మం జిల్లా అమరామరంలో రాకాసి గూళ్లు..పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్‌లో రాకాసి గుండ్లు…..ఆదిమానవుల చరిత్రకు పట్టుగొమ్మలుగా నిలిచిన పల్లెల్లో తవ్వేకొద్దీ చరిత్ర వెలుగుచూస్తోంది. వీటిని చూస్తుంటే సినారె గుండె గొంతుక కళ్లలో కదలాడ్డం ఖాయం.. ఔను .. ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో. పూర్తి వివరాల కోసం దిగువన వీడియో చూడండి.

Also Read:  రోడ్డుపై జెర్రిపోతు హల్‌చల్.. ఏకంగా అరగంట ట్రాఫిక్ ఆపేసింది

 ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు ఇవే..