Throwback: ఓ పోస్ట్ కార్డుతో JRD టాటా నిర్ణయాన్ని మార్చేసిన సుధా మూర్తి.. ఆ కంపెనీలో ఫస్ట్ ఇంజనీర్‌గా గుర్తింపు..

|

May 16, 2023 | 12:51 PM

JRD టాటాకు సంబంధించిన ఈ కథ సుధా మూర్తి ఉద్యోగానికి సంబంధించినది. సుధా మూర్తి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ .. తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అప్పట్లో  గ్రాడ్యుయేషన్‌లో మంచి మార్కులు సాధించిన సుధా మూర్తి కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు.

Throwback: ఓ పోస్ట్ కార్డుతో JRD టాటా నిర్ణయాన్ని మార్చేసిన సుధా మూర్తి.. ఆ కంపెనీలో ఫస్ట్ ఇంజనీర్‌గా గుర్తింపు..
Jrd Tata Sudha Murthy
Follow us on

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి సతీమణి సుధా మూర్తి ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లి.. తన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడించారు. అయితే ఇప్పుడు సుధా మూర్తి గురించి అల్లుడు బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ ఓ విషయాన్నీ గుర్తు చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో రిషి మాట్లాడుతూ..  JRD టాటాకు సంబంధించిన ఒక ఉదంతం చెప్పారు. తన అత్తగారు చేసిన ఓ పని తర్వాత టాటా గ్రూప్ తన మొత్తం విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

JRD టాటాకు సంబంధించిన ఈ కథ సుధా మూర్తి ఉద్యోగానికి సంబంధించినది. సుధా మూర్తి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ .. తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అప్పట్లో  గ్రాడ్యుయేషన్‌లో మంచి మార్కులు సాధించిన సుధా మూర్తి కర్ణాటక ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మాస్టర్స్ డిగ్రీ చేశారు.

సుధ విషయంలో ఏమి జరిగిదంటే.. 
వాస్తవానికి ఈ స్టోరీ 1974లో సుధామూర్తి కాలేజీలో చదువుతున్న కాలం నాటిది. సుధా మూర్తి అమెరికాలో ఉన్నత విద్య చదవడానికి స్కాలర్‌షిప్ పొందారు. అప్పుడు అమెరికా వెళ్లడం కోసం రెడీ అవుతున్నారు. అదే సమయంలో సుధా మూర్తి దృష్టి టాటా గ్రూప్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టెల్కో (నేడు టాటా మోటార్స్) నుంచి ఉద్యోగ ప్రకటనపై పడింది. ఈ ప్రకటనలో సుధ గమనించిన విషయం ఏమిటంటే.. ఈ ఉద్యోగం కేవలం ‘మగవారికి మాత్రమే’ అని ఉన్న విషయం..

ఇవి కూడా చదవండి

సుధ మూర్తికి మగవారికి మాత్రమే అన్న ప్రకటన చూసి కోపం వచ్చింది. తర్వాత తన అభ్యంతరాన్ని తెలియజేయాలని భావించారు. వెంటనే ఉద్యోగం మగవారికి మాత్రమే అన్న విషయాన్నీ  ప్రస్తావిస్తూ.. ఓ పోస్ట్‌కార్డ్ రాశారు. అయితే ఆ పోస్ట్‌కార్డ్‌ని ఎవరికి పంపాలో తెలియక నేరుగా జేఆర్‌డీ టాటాకు అందేలా పోస్ట్ చేశారు సుధా మూర్తి.

సుధ మూర్తి టాటాకి ఏం రాసారంటే.. 
టాటా గ్రూప్ ఉద్యోగ ప్రకటనలో ‘లింగ వివక్ష’ విధానం ఉందంటూ సుధా తన లేఖలో ప్రశ్నించారు. అదేవిధంగా ‘పురుషులకు మాత్రమే’ అనే ఉద్యోగ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మగవాళ్ల కంటే ఆడవారు ఎందుకో తక్కువ.. అసలు అవకాశం ఇచ్చి చూడండి.. ఆడవాళ్ల మెరుగ్గా పని చేయగలరని ఆ లేఖలో తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అసలు ఆడవారికి అవకాశం ఇవ్వకపోతే, ఆమె తనను తాను ఎలా నిరూపించుకుంటుందని ప్రశ్నించారు.

సుధా మూర్తి లెటర్ లో రాసిన ఈ విషయం JRD టాటాకు నచ్చింది. తర్వాత టాటా గ్రూప్ తమ సంస్థలో  ఉద్యోగాల కోసం మహిళలను ఆహ్వానించడం..  పరీక్షించి, ఇంటర్వ్యూలు ద్వారా నియామకాలను చేపట్టడం ప్రారంభించారు. అప్పటి నుంచి కంపెనీలో మొత్తం నియామక విధానాన్ని మార్చారు. సుధా మూర్తికి టెల్కోలో ఉద్యోగం వచ్చింది. టాటా గ్రూప్ కంపెనీలో ఉద్యోగం పొందిన తొలి మహిళా ఇంజనీర్‌గా గుర్తింపును సొంతం చేసుకున్నారు సుధామూర్తి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..