Viral: వేలంలో ఈ నాణెం రూ. 4.25 కోట్లకు అమ్ముడుపోయింది.. అంత స్పెషల్ ఏంటనేగా
ఆన్‌లైన్‌లో నాణెల వేలాన్ని నిర్వహించడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ వేలంపాటల్లో కాయిన్స్ మహా అయితే ఓ పది లేదా 20 లక్షల రూపాయలకు అమ్ముడు పోయి ఉంటాయి. అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న నాణెం మాత్రం ఏకంగా రూ. 4 కోట్లు పలికింది. ఇంతకీ కాయిన్ ఇంతలా పలకడానికి కారణం ఏంటి.? ఇందులో ఉన్న అంత స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాయిన్ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఉన్న అలవాటు ఇది. అరుదైన నాణెలను కొనుగోలు చేయడానికి కొందరు ఎంతకైనా వెళ్తుంటారు. ఎంత ఖర్చయిన చేస్తుంటారు. అయితే మనకు తెలిసినంత వరకు ఒక నాణెం మహా అయితే ఓ రూ. 10 లక్షలకు అమ్ముడు పోయి ఉంటుంది. అయితే పైన ఫొటోలో కనిపిస్తున్న నాణెం మాత్రం ఏకంగా రూ. 4 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంతకీ ఏంటీ నాణెం, అంతలా ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ నాణెంను 1975లో తయారు చేశౄరు. ఇది 20వ శతాబ్దపు అరుదైన నాణేలలో ఒకటిగా చెబుతున్నారు. ఈ నాణెం అమెరికన్ డైమ్ అని, దీనిని 1975లో శాన్ ఫ్రాన్సిస్కో మింట్ తయారు చేసినట్లు వేలం ఏజెన్సీ తెలిపింది. ఈ నాణెంపై ఉన్న ఫొటోలో ఉంది ఎవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్. అలాగే అన్ని నాణెలపై ఉండే ‘S’ సింబల్ ఈ నాణెంపై లేదు. ప్రపంచం మొత్తంలో ఈ రకమైన నాణేలు రెండు మాత్రమే ఉన్నాయి, అందుకే ఈ నాణెం చాలా అరుదు.
అరుదైన ఈ నాణెంను గ్రేట్ కలెక్షన్ అనే వేలం సంస్థ ఆన్‌లైన్‌లో వేళం నిర్వహించింది. ఈ విషయమై కాలిఫోర్నియా గ్రేట్ కలెక్షన్స్ చైర్మన్ ఇయాన్ రస్సెల్ మాట్లాడుతూ.. ఈ నాణెం వేలంపాట విజయవంతం కావడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నాణెం వేలంలో రూ. 4.25 కోట్లు పలికింది. వేలానికి ముందు, ఈ నాణెం ఒహియోకు చెందిన ముగ్గురు సోదరుల వద్ద ఉండేది. అయితే వీరి దగ్గర ఇలాంటి అరుదైన నాణెం మరొకటి కూడా ఉండేది. గతంలో ఈ కాయిన్ రూ. 15 లక్షలకు అమ్ముడుపోయింది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..