Dream: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..

కలలు రావడం సర్వసాధారణమైన విషయమని మనందరికీ తెలిసిందే. అయితే వీటిలో కొన్ని కలలు మనల్ని భయపెడితే మరికొన్ని మంచిని సూచిస్తాయని పండితులు అంటున్నారు. స్వప్నశాస్త్రంలో తెలిపిన అంశాల ప్రకారం కొన్ని రకాల కలలు మంచికి సంకేతమని, మన అభివృద్ధికి సూచికలని చెబుతున్నారు. ఇంతకీ ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
Dream
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 05, 2024 | 5:24 PM

కలలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మనకు వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని విశ్వసిస్తుంటారు. మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే వీటిలో కొన్ని కలలు మంచికి సూచిక అయితే మరికొన్ని చెడుకు సంకేతంగా భావించాలని అంటుంటారు. కలలో కనిపించే కొన్ని అంశాలు మనకు అదృష్టాన్ని తెచ్చి పెడతాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ కలలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కలలో పొలం మధ్యలో ఉన్నట్లు కనిపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చుట్టూ పచ్చని పంట ఉండి మధ్యలో మీరు నిల్చున్నట్లు కలలో కనిపిస్తే ఆర్థికంగా ఏదో లాభం పొందబోతున్నారని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

* ఒకవేళ కలలో చీమల గుంపు వరుసగా వెళ్తున్నట్లు కనిపిస్తే.. వృత్తిపరంగా మీకు మంచి రోజులు రాబోతున్నట్లు అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ పొందబోతున్నారని తెలుసుకోవాలి.

* కలలో గుర్రపు స్వారీ లేదా ఏనుగు స్వారీ చేస్తున్న కనిపిస్తే రాజయోగం లభించబోతోందని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఉన్నత స్థితికి చేరడంతో పాటు సమాజంలో గౌరవం లభించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* కలలో జామ లేదా మామిడి పండ్లు కనిపిస్తే చాలా మంచిదని అంటున్నారు. ఇది ఆర్థికంగా మీ అభివృద్ధిని సూచిస్తుందని శాస్త్రం చెబుతోంది. సంతానం లేని వారికి సంతానం కలగబోతోందని అర్థం చేసుకోవాలి.

* కలలో గోవు కనిపిస్తే.. మీరు దీర్ఘకాలంగా ముందుకు సాగని పనులు పూర్తి కాబోతున్నాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. ఆర్థికపరంగా నెలకొన్ చిక్కులన్నీ తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్‌ చేయండి..