గ్లామర్ షోతో సెగలు.. ఆ భామలు ఎవరు .?
24 December
2024
Battula Prudvi
గ్లామర్ గ్లామర్.. ఎటు చూసినా అదే.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదే నమ్మండి..! ఏ హీరోయిన్‌ను తీసుకున్నా డోస్ పెంచుతూనే ఉన్నారు.
కావాలంటే కీర్తి సురేష్‌నే తీసుకోండి.. బేబీ జాన్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ.. తాజాగా మరో అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.
కొణిదెల వారమ్మాయి నిహారిక సైతం తమిళ సినిమా మద్రాస్‌కారన్ కోసం ఖతర్నాక్ గ్లామర్ సాంగ్ చేసింది. తెలుగులో ఆఫర్స్ లేకపోయినా.. తమిళంలో ఉనికి చాటుకుంటుంది.
మన తంగం వైపు చూద్దాం పదండి..! అదేనండీ జాన్వీ కపూర్ గురించే మనం చెప్పేది. దేవరలో ఉప్పొంగే గ్లామర్ షో చేసింది ఈ బ్యూటీ.
బయట కూడా తగ్గేదే లేదంటుంది జాన్వీ. అలాగే నెక్ట్స్ రామ్ చరణ్ సినిమాలోనూ ఇదే షో కంటిన్యూ చేయడం పక్కా అంటుంది.
కొన్నాళ్లుగా ఫామ్‌లో లేని పూజా హెగ్డే.. 2025ని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ సినిమాతో పాటు.. విజయ్ 69, వరుణ్ ధావన్ సినిమాల్లోనూ నటిస్తుంది.
ఈ మూడింట్లోనూ గ్లామర్ షోకు ఏ ఢోకా లేకుండా చూసుకుంటుంది ఈ జిగేల్ రాణి. అంటే 2025లో సెగలు పుట్టించనుందన్న మాట.
సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, కియారా అద్వానీ లాంటి సీనియర్లు సైతం సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చీరలో జబ్బిలికి సొంత సోదరిలా మెరిసిపోతున్న ఐశ్వర్య..
అందానికి ఈ ముద్దుగుమ్మ ప్రియా సఖి.. స్టన్నింగ్ జాన్వీ..
నింగి నుంచి జాలువారిన తారలు ఈమెలా మారాయి.. డేజ్లింగ్ మిర్న..