AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake vs Mongoose: పాము, ముంగిస మధ్య జాతి వైరం.. అసలు కథ ఇదీ..

జాతి వైరం అనేది సఈష్టి మొదలైనప్పటి నుంచీ ఉంది. కుక్క పిల్లి, పిల్లి ఎలుక, పులి జింక ఇలా ఎన్నో రకాల జీవులకు ఒకటకంటే ఒకదానికి పడదు. వాటిలో ప్రధానంగా పాము ముంగీస పేరే వినపడుతుంది. ముంగిస చేతిలో పాము చనిపోయిన సందర్భాలుంటాయి.. కానీ పాము కాటు వేసినా ముంగిసకు ఏమీ కాదు.. దీని వెనుక సైంటిస్టులు ఆసక్తికర కారణాలను చెప్తున్నారు..

Snake vs Mongoose: పాము, ముంగిస మధ్య జాతి వైరం.. అసలు కథ ఇదీ..
Snake Vs Mongoose
Bhavani
|

Updated on: Feb 21, 2025 | 6:42 PM

Share

పాము ముంగీసకు జాతి వైరం ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరి మధ్యైనా శత్రుత్వం గురించి చెప్పాలన్నా కూడా ఈ రెండు జంతువుల వైరాన్నే ఉదాహరణగా చెప్తారు. వీటికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట వైరలవుతుంటాయి. పొరపాటున ముంగిస కంటికి పాము కనిపిస్తే.. అది శివంగిలా రెచ్చిపోతుంది. పాము మీదకు ఎగబడి మరీ దాన్ని రక్తమొచ్చేలా కొన్ని సందర్భాల్లో పాముల ప్రాణాలు తీసేవరకూ ఇవి వదిలిపెట్టవు. ఈ రెండింటికీ జరిగే పోరులో దాదాపు 80 శాతం వరకు ముంగీసదే పైచేయి అవుతుంది. కానీ, అసలీ రెండు ఎందుకు ఫైట్ చేసుకుంటాయో చాలా మందికి తెలియదు.

మనుగడ కోసం పోరాటం..

అటవీ ప్రాణులకు మనుగడ సాగించడం అన్నింటికన్నా ముఖ్యం. అందుకే ఎంత పెద్ద జంతువు నుంచైనా సరే తమను తాము కాపాడుకుని ఆహారం కోసం వేట సాగిస్తుంటాయి. వీటి లాగానే పాము ముంగిసకు ప్రాణ భయం ఎక్కువ. అందుకే ముంగిసలు పామును చూడగానే మరో ఆలోచన లేకుండా వాటి మీదకు అటాక్ చేస్తుంటాయి. ఒకదాన్ని ఒకటి చంపేందుకు చూస్తుంటాయి. ఈ రెండు జీవులు తమ సంతానానికి హాని తలపెడతాయని ఒకదానికొకటి భావిస్తుంటాయి. అందుకే ముందే వీటిని చంపేందుకు ప్రయత్నిస్తుంటాయి.

పాము కాటుకు ముంగిస చావదు!

చాలా సందర్భాల్లో ముంగిస ధాటికి పాములు ప్రాణాలు విడుస్తుంటాయి. కానీ పాము కరిచిననా ముంగిసకు ఏం కాదు.. మరి పాము విషం ఈ ప్రాణి మీద పనిచేయదా అంటే సైంటిస్టులు ఇలా చెప్తున్నారు. ముంగిస పరిణామక్రమమే ఇందుకు కారణమట. కాల క్రమేణా పాము విషాన్ని సైతం తట్టుకుని మనుగడ సాగించడం వీటికి సాధ్యమైంది. పాములో ఉండే విషం ఏ జీవికైనా ఒళ్లంతా పాకితే అవి కొద్ది సేపటికే మరణిస్తాయి. అయితే, ముంగిసల్లో పాము విషాన్ని స్వీకరించే ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి విషానికి తక్కువగా స్పందిస్తాయి. అంతేకాదు శత్రువు కనుసననల నుంచి మెరుపు వేగంతో పరుగులు తీసే లక్షణం ముంగిసలకు ఉంది. దీంతో అవి పాము కాట్లకు చాలా అరుదుగా గురవుతుంటాయి. ముంగిసలోని ఆల్ఫా, బీటా బ్లాకర్స్ కూడా విషాన్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయి. పాము విషంలోని ఆల్ఫా-న్యూరోటాక్సిన్ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా కండరాలు, నరాలను పనిచేయకుండా చేస్తాయి. దీంతో పాము కాటుకు గురయ్యే బాధితుడు పక్షవాతానికి గురికావడం లేదా చనిపోవడం జరుగుతుంది. అయితే, ముంగిస శరీరంపై ఉండే ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు ఆల్ఫా-న్యూరోటాక్సిన్‌ను అడ్డుకుంటాయి. దానివల్ల పాము కాటేసినా.. ఏమీ కాదు. అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కాటేసినా.. ముంగిసకు ఏమీ కాదు. అయితే, భారీ విషపూరిత పాములకు మాత్రం ముంగిసలకు చంపే సామర్థ్యం ఉంటుందట.

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..