Steelbird New Helmet: వేసవిలోనూ కూల్ కూల్.. ఇది ధరిస్తే ఏసీ ధరించినట్లే.. స్టీల్‌బర్డ్ నుంచి సరికొత్త హెల్మెట్..!

|

Apr 12, 2023 | 5:12 PM

Steelbird SBA19 R2K: ప్రముఖ హెల్మెట్ తయారీ కంపెనీ స్టీల్ బర్డ్.. కస్టమర్ల కోసం సరికొత్త ఫ్లిప్-అప్ హెల్మెట్‌ను విడుదల చేసింది. అతి తక్కువ ధరకే మాంచి ఫీచర్స్ కలిగిన ఈ హెల్మెట్.. వేసవిలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో మెయిన్ ఫీచర్ ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ సిస్టమ్.

Steelbird New Helmet: వేసవిలోనూ కూల్ కూల్.. ఇది ధరిస్తే ఏసీ ధరించినట్లే.. స్టీల్‌బర్డ్ నుంచి సరికొత్త హెల్మెట్..!
Steelbird Helmet
Follow us on

ప్రముఖ హెల్మెట్ తయారీ కంపెనీ స్టీల్ బర్డ్.. కస్టమర్ల కోసం సరికొత్త ఫ్లిప్-అప్ హెల్మెట్‌ను విడుదల చేసింది. అతి తక్కువ ధరకే మాంచి ఫీచర్స్ కలిగిన ఈ హెల్మెట్.. వేసవిలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో మెయిన్ ఫీచర్ ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ సిస్టమ్. ఈ వేసవిలో ఈ హెల్మెట్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వేసవిలో బైక్, స్కూటర్ పై వెళ్తున్నప్పుడు దీనిని ధరించడం వలన.. తలకు చెమట పట్టకుండా చల్లటి గాలి వస్తుంది. ఈ హెల్మెట్‌ BIS- సర్టిఫైడ్ కూడా. అయితే, స్టీల్ బర్డ్ విడుదల చేసిన ఈ హెల్మెట్‌ను కేవలం రూ. 1,199తో ఆన్‌లైన్‌లో కంపెనీ అధికారిక స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు.

SBA19 R2K ఫ్లిప్-అప్ హెల్మెట్ థర్మోప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ థర్మోప్లాస్టిక్ సెల్ ఏ పరిస్థితిలోనైనా రక్షణ అందిస్తుంది. హెల్మెట్ లోపలి భాగం మార్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇది రైడర్‌కు గొప్ప సౌకర్యాన్ని అందిస్తుంది. అధిక-సాంద్రత EPSని కలిగి ఉంటుంది. ఇది ప్రభావం-నిరోధకతను కలిగి ఉంటుంది. visor ఒక పాలికార్బోనేట్ యాంటీ-స్క్రాచ్ కోటింగ్‌తో అందించబడింది. ఇది డ్రైవర్లకు స్పష్టమైన దృష్టిని అందిస్తుంది.

SBA19 R2K ఫ్లిప్-అప్ హెల్మెట్ మొత్తం మూడు పరిమాణాలలో అందుబాటులో ఉంది. మీడియం 580 mm, లార్జ్ 600 mm, ఎక్స్‌ట్రా లార్జ్ 620 mm. డ్రైవర్లు తమ తల సైజును బట్టి తమకు నచ్చిన రంగు హెల్మెట్‌ను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..