Happy Pregnancy: గర్భస్థ శిశువులకు ప్రహ్లాదుడు, అభిమన్యుడి గాథలు.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

|

Mar 09, 2023 | 11:23 AM

పుట్టబోయే బిడ్డకు అమ్మ కడుపులోనే సంస్కరం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైన్స్ తో పాటు.. భక్తప్రహ్లాద, అభిమన్యుడి కథలు తెరపైకి వచ్చాయి. 

Happy Pregnancy: గర్భస్థ శిశువులకు ప్రహ్లాదుడు, అభిమన్యుడి గాథలు.. తాజా పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు
Rrs Garbha Sanskar
Follow us on

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కు మహిళలకు సంబంధించిన ఒక సంస్థ రాష్ట్ర సేవికా సమితి కూడా ఉంది. ఈ రాష్ట్ర సేవికా సమితికి సంబంధించిన సంవర్ధిని న్యాస్ అనే సంస్థ గర్భిణీ స్త్రీల కోసం ‘గర్భ్ సంస్కార్’ ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గర్భిణీ స్త్రీకి రామాయణ, మహాభారతాలు, భగవద్గీతలోని కథలను వినిపించనున్నారు. పుట్టబోయే బిడ్డకు అమ్మ కడుపులోనే సంస్కరం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైన్స్ తో పాటు.. భక్తప్రహ్లాద, అభిమన్యుడి కథలు తెరపైకి వచ్చాయి.

హిరణ్యకశ్యపుడనే రాక్షసుడు వరం కోసం తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు.. దేవతలు హిరణ్య కశ్యపుడి భార్య లీలావతి బంధించారు. అప్పుడు ఆమె గర్భవతి. అయితే దేవేంద్రుడు లీలావతి గర్భంలో పెరుగుతోంది రాక్షసరాజు వారసుడు అతనితో దేవతలకు ఎప్పుడైనా ముప్పు తప్పదంటూ చంపేయాలని భావించాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న నారదుడు.. వారించి.. గర్భిణీ లీలావతిని తమ ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అప్పుడు నారదుడు.. విష్ణువు మహిమల గురించి లీలావతి చెబుతూ ఉండేవాడు. నారదుడు చెప్పే విషయాలను గర్భంలో ఉన్న శిశువు కూడా వింటూ ఉండేవాడు. దీంతో బాల ప్రహ్లాదుడు గర్భంలో ఉన్న సమయంలోనే మహా విష్ణువుకి గొప్ప భక్తుడుగా మారాడు.

మహాభారతలో కూడా గర్భస్థ శిశువు గురించి మరొక కథ కూడా ఉంది. తల్లి సుభద్ర అర్జునుల తనయుడు.. తల్లి గర్భంలోనే చక్రవ్యూహాన్ని ఛేదించే కళను నేర్చుకున్నాడు. తండ్రి అర్జునుడి తన భార్య గర్భంలో ఉన్న శిశివుడుకి యుద్ధ విద్యలను వినిపించేవాడు. అలా తండ్రి నుంచి అనేక విద్యలను గర్భంలోనే నేర్చుకున్నాడు అభిమన్యుడు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ పెద్దలు, హిందూ సనాతన ధర్మంలో గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండలని.. భగవంతుడిని ఆరాధన చేయడం.. భజనలు చేయడం,  సత్ సత్సంగాలను వినాలని సలహా ఇస్తూనే ఉంటారు. ఇలా చేయడం వలన పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందని చెబుతారు. అనాదిగా హిందూ సనాతన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న మన దేశంలో ఇలాంటి నమ్మకాలు సర్వసాధారణం. ఇప్పుడు మళ్ళీ పెద్దలు చెప్పిన విషయాలు పురాణాలలోని భక్త ప్రహ్లాదుడు, అభిమన్యుడు గురించి కథలు వినిపిస్తున్నాయి. సర్వత్రా చర్యకు వస్తున్నాయి.

వైద్య నిపుణుల అభిప్రాయం
గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం, కడుపులో పెరుగుతున్న బిడ్డ శబ్దాలను వినగలదు.. అయితే భాషను అర్థం చేసుకోదు. పరిశోధన ప్రకారం, గర్భంలో పిండం అభివృద్ధి చెందే సమయంలో..  చెవులు అభివృద్ధి చెందుతాయి. ఈ సందర్భంలో ధ్వని తరంగాలు శిశువు చెవులకు చేరతాయి. అయితే గీత, రామాయణ పారాయణం గర్భస్థ శిశువుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడం చాలా కష్టం. దీనికి శాస్త్రీయ ఆధారం లేదని అంటున్నారు.

నీవు వింటున్నావా?
సైకాలజీ టుడే జర్నల్‌లో ప్రచురించబడిన పిండం మనస్తత్వ శాస్త్ర అధ్యయనం ప్రకారం, కడుపులో ఉన్న పిండం కలలు కంటుంది.  అనుభూతి చెందుతుంది, ఎక్కిళ్ళు , పెద్ద శబ్దాలకు ప్రతిస్పందిస్తుంది. 13 వ వారంలో వినే సామర్థ్యం శిశువుకి అభివృద్ధి చెందుతుంది. అప్పటి నుంచి ఆ శిశువు తన తల్లి , ఇతరుల స్వరం మధ్య తేడాను కూడా గుర్తించగలడని అధ్యయనం చెబుతోంది.

పరిశోధన ప్రకారం, అనుభూతి, చూడటం, వినడం వంటి సామర్థ్యంతో పాటు, నేర్చుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని కూడా పొందుతుంది పిండి.    కడుపులో పెరుగుతున్న పిండానికి ఒకటే కథ పదే పదే చెబితే రియాక్ట్ అవుతుంది. శబ్దం వచ్చినప్పుడు శిశువు కూడా ఆశ్చర్యపోతాడు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, కడుపులో పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో తల్లి సానుకూలమైన పనులు చేస్తే, అది పిల్లలపై కూడా ప్రభావం చూపుతుంది.

పరిశోధ కొనసాగుతోంది…
రీసెర్చ్ స్టడీస్ ప్రకారం.. గర్భిణీ స్త్రీ ఒత్తిడికి గురైనప్పుడు పిల్లలపై ఆ ప్రభావం సహజంగా పడుతుంది. ఒత్తిడికి గురైన గర్భిణీ స్త్రీ రామాయణం లేదా గీత పఠించడం ద్వారా శాంతిని పొందినట్లయితే లేదా భజనలు లేదా పాటలు పాడటం/వినడం ద్వారా ఆనందాన్ని పొందినట్లయితే, ఆమె శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు పిండంపై కూడా ప్రభావం చూపుతాయి. తల్లి ఒత్తిడి హార్మోనుల మాదిరిగానే సంతోషకరమైన హార్మోన్లు పుట్టబోయే బిడ్డపై అదే ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.

కడుపులో పెరుగుతున్న బిడ్డపై సంగీతం లేదా శబ్దం ప్రభావం గురించి బనారస్ హిందూ యూనివర్సిటీలో పరిశోధన జరుగుతోంది. తల్లి ఒత్తిడిలో ఉంటే గర్భ్ సంస్కార్‌లో పాల్గొనే కార్యకలాపాలు వంటి చికిత్సల ప్రభావం ఎలా ఉంటుందనేది పరిశోధనలో ఒక అంశం కూడా ఉంది. ఈ పరిశోధన ఇప్పుడే ప్రారంభమైనప్పటికీ, ఫలితాలు రావడానికి సమయం పడుతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..