ఇటీవల కాలంలో చాలామంది తరచూ అలా కూర్చోగానే ఇలా ఆవలింతలు వస్తూ ఉంటాయి. అయితే ఇది చాలా సహజం. అయినా నలుగురిలో ఉన్నప్పుడు ఇలా పదేపదే ఆవలింతలు వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి రోజుకు దాదాపు 5 నుంచి 19 సార్లు ఆవలిస్తాడని ఒక అధ్యయనంలో తేలింది. స్లీప్ ఫౌండేషన్ ప్రకారం రోజుకు పదిసార్లు కంటే ఎక్కువ ఆవలించే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారట. ముఖ్యంగా రోజుకి వందసార్లు ఆవలించే వాళ్ళు కూడా ఉన్నారటంలో సందేహం లేదు. అయితే కొన్ని సమయాలలో ఎక్కువ ఆవలింతలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయట. ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్స్ కారణంగా ఇలా జరుగుతూ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. విపరీతంగా ఆవలింతలు రావడం కొన్ని సమయాలలో కొన్ని తీవ్రమైన వ్యాధులకు లేదా అసాధారణ సమస్యలకు లక్షణాలు కావచ్చని వైద్యులు స్పష్టం చేశారు.
ముఖ్యంగా ఎక్కువసార్లు ఆవలింతలు రావడానికి గల కారణం ఏమిటి అంటే అప్నియా లాంటి నిద్ర రుగ్మతకు కారణం అయి ఉండవచ్చు. అది పగటి నిద్రకు ఎక్కువగా దారితీస్తుంది. ఎక్కువగా ఆవలించడం వల్ల జీర్ణక్రియ వ్యాధులకు కూడా కారణం అవుతుంది. నార్కో లిప్సి అనేది ఒక రకమైన నిద్రలేమి సమస్య. కాబట్టి దీని వల్ల ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కడైనా హఠాత్తుగా నిద్రలోకి జారుకుంటూ ఉంటాడు. ఈ వ్యాధిలో రోగి రోజులో చాలా సార్లు నిద్రపోవడానికి ఇష్టపడతాడు. దీని కారణంగానే చాలా సార్లు ఆవలిస్తూ ఉంటారు. ఈ వ్యాధిలో శ్వాస తీసుకోవడంలో కూడా సమస్య వస్తుందట.
ఇంకా చెప్పాలంటే ఆవలింతలతో సంబంధం ఉన్న వాగస్ నరాల వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం అతిగా ఆవలిస్తే. గుండెపోటు లేదా గుండె చుట్టూ రక్తస్రావం జరిగే అవకాశం ఉందట. సాధారణంగా చాలామంది పగటిపూట నిద్రపోతారు. దీని కారణంగా వారిలో ఆవలింపు సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి పగటిపూట నిద్రపోవడం అనేది మానుకుంటే మంచిది అలాగే రాత్రిపూట మేల్కొంటూ ఉంటారు ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..