Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. పండుగ ముందు 3 కిలోల చక్కెర పంపిణీ.. ఎక్కడంటే..?

| Edited By: Anil kumar poka

Oct 29, 2021 | 4:43 PM

Ration Card: దీపావళికి ముందు రేషన్ కార్డుదారులకు మూడు కిలోల చక్కెర ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ మొదటి వారంలో

Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. పండుగ ముందు 3 కిలోల చక్కెర పంపిణీ.. ఎక్కడంటే..?
Ration Card
Follow us on

Ration Card: దీపావళికి ముందు రేషన్ కార్డుదారులకు మూడు కిలోల చక్కెర ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ మొదటి వారంలో దీపావళి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని అంత్యోదయ కార్డుదారులకు మూడు కిలోల పంచదార అందజేస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు ఈ చక్కెరను అందజేస్తారు. అలాగే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద రేషన్ కార్డుదారులకు ఐదు కిలోల గోధుమలు కూడా ఇవ్వనున్నారు. నవంబర్ 3 నుంచి15 వరకు రేషన్ పంపిణీ జరుగుతుందని అధికారులు ప్రకటించారు.

దీపావళి కారణంగా ఈసారి రేషన్ పంపిణీని 5వ తేదీ నుంచి కాకుండా నవంబర్ 3వ తేదీ నుంచి చేపడతామని రాష్ట్ర అదనపు ఆహార కమిషనర్ అనిల్ కుమార్ దూబే తెలిపారు. అంత్యోదయ కార్డుదారులకు కిలోకు రూ.18 చొప్పున పంచదార అందజేయగా, రేషన్ కార్డుదారులకు మాత్రం పోర్టబిలిటీ కింద ఆహార ధాన్యాలు తీసుకునేందుకు అనుమతిస్తారు. చక్కెర, ఆహార ధాన్యాల పంపిణీకి నవంబర్ 15 చివరి తేదీగా నిర్ణయించామని తెలిపారు.

ప్రామాణీకరణ కోసం మొబైల్‌కి OTP పంపిస్తామన్నారు. తర్వాత ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుందని ఇందుకోసం రేషన్ షాపులలో రోస్టర్‌ను నిర్ణయించి ఎనిమిది రోజుల్లో మొత్తం ఆహార ధాన్యాల పంపిణీ పూర్తి చేస్తామని వివరించారు. అలాగే ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు బోనస్‌ను ప్రకటించింది. నవంబర్ 1 నాటికి ఉద్యోగి ఖాతాలో బోనస్ చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వం, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

NCRB Data: దేశంలో పెరిగిన ఆత్మహత్యలు.. ప్రమాదాల కారణంగా తగ్గిన మరణాల సంఖ్య..

Gangajal: పవిత్రమైన గంగాజలం ఇంట్లో ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..! చాలా నష్టపోతారు..

Health News: ఈ 4 చెడ్డ అలవాట్ల వల్లే అన్ని రోగాలు..! వీటిని మార్చుకుంటే జీవితం హ్యాపీ.. అవేంటంటే..?