Astrology 2025: కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
Rahu Gochar 2025: జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు వక్ర గ్రహమే కాక, పాప గ్రహం కూడా..ఒకరికి ఊహించని కష్టాలు, సమస్యలను తెచ్చిపెట్టడంలో, బరువు బాధ్యతలు పెంచడంలో, ధన నష్టాలు కలిగించడంలో రాహువును మించిన గ్రహం లేదు. దాదాపు శని ఫలితాలనే రాహువు కూడా ఇస్తాడని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది.
Rahu Transit 2025: వచ్చే ఏడాది (2025) మే నెల 18 నుంచి రాహువు మీన రాశి నుంచి కుంభ రాశిలోకి మారి, అక్కడ ఏడాదిన్నర పాటు సంచారం చేయడం జరుగుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రాహువు వక్ర గ్రహమే కాక, పాప గ్రహం కూడా. ఊహించని కష్టాలు, సమస్యలను తెచ్చిపెట్టడంలో, బరువు బాధ్యతలు పెంచడంలో, ధన నష్టాలు కలిగించడంలో రాహువును మించిన గ్రహం లేదు. దాదాపు శని ఫలితాలనే రాహువు కూడా ఇస్తాడని కూడా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కుంభ రాశి రాహువుకు మిత్ర రాశి. అందువల్ల తక్కువ స్థాయిలో మాత్రమే సమస్యలను ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశులవారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రాహుకేతువులకు పూజ చేయించడం, తరచూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల రాహువు వల్ల మేలు జరుగుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాక, అనేక పర్యాయాలు మోసపోవడం, ధనం నష్టం కావడం కూడా జరుగుతుంది. రోగ నిర్ధారణ చేయలేని అనారోగ్యాలు పీడిస్తాయి. వైవాహిక సమస్యలు తలెత్తు తాయి. ముఖ్యమైన ప్రయత్నాలు వెనుకపట్టు పడతాయి. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించడం, దూర ప్రాంతానికి బదిలీ కావడం వంటివి జరుగుతాయి.
- సింహం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాహువు సంచారం వల్ల వ్యాపారాల్లో భాగస్వాముల వల్ల చిక్కు సమస్యలు తలెత్తుతాయి. పెళ్లి ప్రయత్నాలు బాగా ఆలస్యం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో అశాంతి, అసంతృప్తి కలుగుతాయి. నిరుద్యో గులకు చిన్నపాటి ఉద్యోగం లభించడం, తక్కువ జీతంతో ఉద్యోగం చేయవలసి రావడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గుతుంది. వృత్తి జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది.
- తుల: ఈ రాశికి పంచమ స్థానంలో రాహువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పొరపాట్లు చేయడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. సమర్థత విషయంలో అధికారులకు నమ్మకం సడలే అవకాశం ఉంది. పిల్లలు తరచూ అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు తగ్గుతాయి. మిత్రుల వల్ల ధన నష్టం జరిగే సూచనలున్నాయి. ఆదాయం కొద్దిగా తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు సంచారం వల్ల కుటుంబ జీవితంలో బాగా ఒత్తిడి పెరుగు తుంది. కుటుంబంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. తరచూ అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రుల వల్ల ధన నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం తగ్గే సూచనలు కూడా ఉన్నాయి.
- కుంభం: ఈ రాశిలో రాహువు సంచారం చేయడం వల్ల ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. నష్టదాయక వ్యవహారాల వల్ల ఇబ్బంది పడతారు. పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం, ధన పరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. తరచూ అనారోగ్యాలకు గురి కావడం జరుగుతుంది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండకపోవచ్చు.
- మీనం: ఈ రాశికి వ్యయ స్థానంలో రాహువు సంచారం వల్ల వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఎదురవుతుంది. వివాదాలు, ఊహించని సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. మీ వల్ల సహా యం పొందినవారు ముఖం చాటేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఇబ్బందులుంటాయి.