PM Ujjwala Yojana: ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ( PIB ) ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY)కి సంబంధించి ఒక పరిశోధనా నివేదికను విడుదల చేసింది . 2016లో 62 శాతంగా ఉన్న ఎల్‌పీజీ కవరేజీ 2022లో 104.1 శాతానికి పెరిగిందని ఈ నివేదికలో పేర్కొంది. గత 6 ఏళ్లలో పీఎం ఉజ్వల పథకం కింద 9 కోట్లకు పైగా డిపాజిట్ ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ పథకం లబ్ధిదారులలో 35.1% మంది షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగల నుండి వచ్చారు. నివేదిక ప్రకారం.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీలో 14 కోట్లకు పైగా ఉచిత LGP గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. అయితే ఈ పీఎం ఉజ్వల యోజన పథకం 01 మే 2016న ప్రారంభించారు. ఉజ్వల 2.0 10 ఆగస్టు 2021న ప్రారంభించబడింది. మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేస్తూ పొగతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్రం. ఈ పథకం కింద, అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత LPG కనెక్షన్ అందించారు. అయితే దీని కోసం ప్రభుత్వం ప్రతి కనెక్షన్‌కు 1600 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. మొదటిసారిగా చమురు మార్కెటింగ్ కంపెనీల తరపున లబ్ధిదారునికి ఉచిత LPG గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ ఇవ్వబడుతుంది.
ఈ పథకం ప్రారంభంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పిజి కనెక్షన్లు ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశం. తరువాత 8 కోట్ల ఉచిత LGP కనెక్షన్లను అందించింది. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి అమలు చేస్తున్నారు. PM ఉజ్వల యోజన కింద LPG కనెక్షన్ పొందని కుటుంబాలు లేదా మహిళలను కవర్ చేయడానికి ఉజ్జ్వల 2.0 ప్రారంభించబడింది. ఇది 10 ఆగస్టు 2021న ప్రారంభించబడింది. 31 జనవరి 2022 నాటికి ఉజ్వల 2.0 కింద 1 కోటి ఎల్‌పిజి కనెక్షన్‌లను పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది. 8 కోట్ల ఉచిత LPG కనెక్షన్‌లను పంపిణీ చేసే పని సెప్టెంబర్ 2019లో షెడ్యూల్ తేదీ కంటే 7 నెలల ముందే పూర్తయింది. PMUY కింద తలసరి LPG వినియోగం పెరిగిందని, 2019-20లో ఇది 3.01 కోట్లుగా ఉండగా, 2021-22లో 3.66 కోట్లకు పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. PMUY ప్రారంభంతో LPG పంపిణీ కేంద్రాల ద్వారా లక్ష మందికి ఉపాధి లభించిందని తెలిపింది.
కోవిడ్ సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద లక్షలాది మందికి ఉచిత LPG గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులకు 14 కోట్లకు పైగా ఉచిత LPG గ్యాస్ సిలిండర్లను అందించినట్లు నివేదిక పేర్కొంది . ఈ పథకంలో అన్ని LPG కనెక్షన్లు పేద కుటుంబానికి చెందిన వయోజన మహిళ పేరు మీద ఇవ్వబడతాయి. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండిన స్త్రీ అయి ఉండాలి.
☛ కుటుంబం ఇప్పటికే ఏ ఇతర గ్యాస్ కంపెనీ కనెక్షన్ కలిగి ఉండకూడదు.
☛ దరఖాస్తుదారు ఆధార్‌లో పేర్కొన్న చిరునామాలోనే నివసిస్తుంటే (అస్సాం మరియు మేఘాలయకు తప్పనిసరి కాదు) గుర్తింపు రుజువు, చిరునామాగా ఆధార్ కార్డ్ తప్పనిసరి.
☛ దరఖాస్తు చేసుకున్న రాష్ట్రం / ఇతర రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డ్ గానీ, ఇతర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు అవసరం.
☛ లబ్దిదారు, కుటుంబంలోని పెద్దల ఆధార్ అవసరం.
☛ బ్యాంక్ అకౌంట్ నెంబర్
☛ ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీరు దరఖాస్తు కోసం ఆన్‌లైన్ పోర్టల్‌కి వెళ్లవచ్చు. అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
PM @narendramodi launched Pradhan Mantri #Ujjwala Yojana to safeguard the health of women and children by providing them with clean cooking
fuel, so that they don’t have to compromise their health in a smoky kitchen.Read more: https://t.co/vR79IP930w pic.twitter.com/zQK41Z8Fc0
— PIB India (@PIB_India) April 24, 2022
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: