AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం మన అరచేతిలోని రేఖలను బట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం తెలుసుకోవచ్చని అందరికీ తెలుసు. కానీ శరీరంలోని వివిధ భాగాలు కూడా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చాలా మందికి తెలియదు. అవును మన చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మీ చేతి వేలి ఆకారం ఏమిటో చూసి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి.

Personality Test: చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు.. ఎలా అంటే?
Personality Test
Anand T
|

Updated on: Oct 25, 2025 | 4:32 PM

Share

ప్రపంచంలో ఒకరిని పోలిన మనుషులు మరొకరు ఉన్నా.. వారి వ్యక్తిత్వాలు, అభిరుచులు, అవాట్లు మాత్రం కచ్చితంగా వేరుగా ఉంటాయి. అదేవిధంగా, ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ఒక్కరి శరీర ఆకృతి కూడా భిన్నంగా ఉంటుంది. అయితే హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిరేఖలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా సూచిస్తాయో.. వారి శరీర ఆకృతులు కూడా అలానే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. వాటిలో మన చేతి వేళ్లు కూడా ఒకటి. ఇక్కడ మన చేతి వేళ్లు ఉండే ఆకారాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏలాంటిదో తెలుసుకోవచ్చు.

మీ వేలు ఆకారాన్ని బట్టి వీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి.

నిటారుగా ఉండే వేలు: ఒక వ్యక్తి చేతి వేళ్లు పొడవుగా, నిటారుగా ఉంటే, వారు తమ విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడని వారని అర్థం. వాళ్లు తమ భావాలను, రహస్యాలను ఎవరితోనూ పంచుకోకుండా వారిలోనే ఉంచుకుంటారు. అలాగే వీరు నమ్మకానికి ఎక్కువ విలువ ఇస్తారు. అలా అని ఎవరినీ అంత సులభంగా నమ్మరు. కానీ నమ్మిన వారిని మాత్రం ఎప్పటికీ వదలరు. వీరు సుఖ, దుఖాల్లోనూ ఒకే మాదిరిగా ఉంటారు. వీరు ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతారు. వీరిలో నిజాయితీగా ఉంటారు. వీరికి అబద్దాలు చెప్పడం నచ్చదు. అలాగే వీరు ద్రోహాన్ని ఎప్పటికీ సహించరు. మొత్తం మీద వీళ్లను అర్థం చేసుకోవలం చాలా కష్టం.

చూపుడు వేలు: మీ వేలు ఆకారం చూపుడు వేలు అయితే, మీరు బహుశా నమ్మకమైన, ప్రేమగల వ్యక్తి అని అర్థం. వీరు సులభంగా ప్రేమలో పడతారు. అలాగే, మీరు సృజనాత్మకంగా, సహజంగా ఉంటారు. అలాగే మీ దారిలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా మీరు దృఢ సంకల్పంతో మీ కలలను నిజం చేసుకుంటారు. మీరు కొత్త భావనలను అన్వేషించడంలో, నేర్చుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు. మీరు ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీ లక్ష్యాలు, కలలను లోతుగా నమ్ముతారు. వాటిని నిజం చేసుకోవాలని మీరు దృఢ నిశ్చయంతో ఉంటారు.

వంపుతిరిగిన వేలు: మీ వేలు ఆకారం వంపుతిరిగినట్లయితే, మీరు ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యంగల వ్యక్తి అని అర్థం. మీ ధైర్యం మీకు ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇలాంటి వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా, మీరు సులభంగా సంబంధాలను ఏర్పరచుకుంటారు. వీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతారు.

మరిన్ని హ్యూమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్