కొత్త కొత్త ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న నెటిజన్లు.. తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది..

సోషల్‌ మీడియాలో ఇప్పటికే పలు చిత్ర విచిత్రమైనా.. ప్రమాదకరమైనా ఛాలెంజ్‌ దర్శనమిస్తుంటాయి.. అడ్డమైన ఛాలెంజ్ లు ప్రయత్నించి ప్రాణాలు పొగొట్టుకున్న వారు చాలామందే ఉన్నారు.

కొత్త కొత్త ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌లతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న నెటిజన్లు.. తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది..

సోషల్‌ మీడియాలో ఇప్పటికే పలు చిత్ర విచిత్రమైనా.. ప్రమాదకరమైనా ఛాలెంజ్‌ దర్శనమిస్తుంటాయి.. అడ్డమైన ఛాలెంజ్ లు ప్రయత్నించి ప్రాణాలు పొగొట్టుకున్న వారు చాలామందే ఉన్నారు. అయినా.. ఇలాంటి ఛాలెంజ్‌లకు క్రేజ్‌ పెరుగుతూనే వస్తోంది. ప్రమాదకర టాస్క్‌లు చేయొద్దు అంటూ నిఫుణులు హెచ్చరించినా.. అవి పట్టించుకోకుండా.. ఛాలెంజ్స్‌ చేస్తున్నే ఉన్నారు కొందరు. అయితే తాజాగా ఇప్పుడు మరో కొత్త ఛాలెంజ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఫుట్‌ పీలింగ్‌ అనే కొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టిన కొందరు టిక్‌టాక్‌ ప్రియులు.. టిక్ టాక్ మనదగ్గర బ్యాన్ అయ్యింది కానీ కొన్నిప్రాంతాల్లో ఈ యాప్ కంటిన్యూ అవుతుంది. కాగా ఈ ఛాలెంజ్ ను చేసి.. గాయాల పాలవుతున్నారు. అయితే ఈ ఛాలెంజ్‌కు ప్రపంచవ్యాప్తంగా యమ క్రేజ్‌ ఉంది. తమ కాళ్లకు ఫుట్‌ పీలింగ్‌ మాస్కును అంటించుకుని, అరికాళ్ల తోలును పీకేసుకుంటూ వీడియోలను రికార్డు చేసుకుంటున్నారు. పని గట్టుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక ఇలా చేయడం వల్ల అరి కాళ్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉందని.. హెచ్చరిస్తున్నారు నిఫుణులు. ఫుట్‌ పీలింగ్‌ మాస్క్‌ జెల్‌ను రెండు అరికాళ్లకు పట్టించుకోవాలి. బాగా ఆరిన తర్వాత జెల్‌ అరికాళ్లకు గట్టిగా అతుక్కుపోయి పైన చర్మంలాగా ఏర్పడుతుంది. పైన చర్మంలాగా ఉన్న దాన్ని పీకేసుకోవాలి. అయితే ఈ ఛాలెంజ్‌ మనం అనుకున్నంత వీజీ ఏమీ కాదు! ఎక్కవ సేపు గనుక చర్మంపై దాన్ని ఉంచుకుంటే అలర్జీల బారిన పడి కాళ్లకు పుండ్లు లేచే అవకాశం ఉంది. ఇలాంటి పిచ్చి, పిచ్చి ఛాలెంజ్‌లు చేసేముందు.. ఒకటి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు వైద్యులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Acharya Movie: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ ఆచార్య… చరణ్ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu