Acharya Movie: శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ ఆచార్య… చరణ్ పాత్ర చాలా స్పెషల్ గా డిజైన్ చేశారట..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో చరణ్ జాయిన్ అయ్యాడు. ఈ మూవీలో చరణ్ సిద్ద అనే పాత్రలో కనిపించనున్నాడు. మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల కానుంది. దాంతో ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.
ఇదిలా ఉంటే తెరపై చరణ్ కనిపించేది కొంతసేపే అయినా ఆ పాత్ర సినిమా అంతటా తన ప్రభావం చూపుతూనే ఉంటుందట. ఈ పాత్రను కొరటాల చాలా కొత్తగా డిజైన్ చేశాడని చెబుతున్నారు. అవినీతిని సహించని యువకుడిగా చరణ్ కనిపించనున్నాడట.అలాగే డైలాగ్ డెలివరీ .. యాక్షన్ ఎపిసోడ్ .. కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. చిరంజీవి చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక చరణ్ సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘పక్కా కమర్షియల్’ గా రానున్న మ్యాచో హీరో.. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కథతో ఈ మూవీ రానుందా..?