‘పక్కా కమర్షియల్’ గా రానున్న మ్యాచో హీరో.. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కథతో ఈ మూవీ రానుందా..?
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యు.వి క్రియేషన్స్, జి ఎ2 పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Pakka Commercial : మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో యు.వి క్రియేషన్స్, జి ఎ2 పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కమర్షియల్ కాన్సెప్ట్‌కి కామెడీని యాడ్ చేసి ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజూ పండగే’ లాంటి హిట్ సినిమాలతో ఆకట్టుకున్నాడు మారుతి. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ ఫస్ట్ టైమ్ కామెడీతో కమర్షియల్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నాడు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఓ సినిమా కథతోనే ఇప్పుడు గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది.
ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీ కథలనే ఈ సినిమా కూడా ఉండబోతుందని అంటున్నారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ మొదట డబ్బుకోసం ఏమైనా చేసే అవినీతిపరుడైన పోలీస్ గా కనిపిస్తాడు. ఆతర్వాత క్లైమాక్స్ లో మంచి వాడిగా మారి ఏకంగా చచ్చిపోవడానికే సిద్దపడుతాడు. ఇక ఇదే కథ కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాలో కూడా చూడవచ్చు ఆ సినిమాలో కూడా హీరో మొదటినుంచి అవినీతిపరుడుగా ఉండి చివరిలో మారతాడు. ఇప్పుడు గోపీచంద్ సినిమ కూడా అలానే ఉండబోతుందంటూ ఫిలిమాగర్లో జోరుగా ప్రచారం సాగుతుంది. డబ్బు కోసం ఎలాంటి కేసులు అయినా వాదించే పక్కా కమర్షియల్ లాయర్ గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక మార్చి 5 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 1న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
7 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న అమితాబ్ సతిమణి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..