7 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న అమితాబ్ సతిమణి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న బీటౌన్‏లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జయాబచ్చన్ సమాజ్ వాది ఎంపీగా ఉన్నారు. అయితే గతంలో జయా బచ్చన్

7 ఏళ్ళ తర్వాత ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న అమితాబ్ సతిమణి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 18, 2021 | 8:18 PM

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న బీటౌన్‏లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జయాబచ్చన్ సమాజ్ వాది ఎంపీగా ఉన్నారు. అయితే గతంలో జయా బచ్చన్ ‘కబీ కుషి కబీ ఘమ్’, ‘కల్ హోనా హో’, ‘లాగా చునారీ మేన్ దాగ్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత జయాబచ్చన్ మొత్తం సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా జయా బచ్చన్ ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అది కూడా ఓ మరాఠీ సినిమా అన్నట్లుగా తెలుస్తోంది. మరాఠీలో ఫేమస్ డైరెక్టర్ గజేంద్ర అహిరే దర్శకత్వంలో జయా బచ్చన్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ గజేంద్ర మాట్లాడుతూ.. “మేము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ విషయం పై రూమర్స్ వచ్చేసాయి. కానీ నేను కూడా అనుకుంటున్నాను ఈ సినిమాలో జయా బచ్చన్ ఉంటే బాగుండుని అని. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాను. కానీ ఎలాంటి స్పందన రాలేదు . త్వరలోనే జయా బచ్చన్ ఒప్పుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె ఏ భాషలో రీఎంట్రీ ఇవ్వనున్నారనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు” అంటూ చెప్పుకోచ్చాడు. అయితే ఈ విషయం పై జయా బచ్చన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట