ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ బ్లాక్‌బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బ్లాక్‌బాస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ జోష్‌లోనే మరో సినిమాను అనౌన్స్ చేశారు. కొత్త సినిమా ప్రకటించి దాదాపుగా ఎనిమిది నెలలు కంప్లీట్ అయ్యింది. తారక్ ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ విరామ సమయంలో త్రివిక్రమ్ మరో హీరోతో త్వరలోనే ఈ సినిమా రూపొందించబోతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచన మాటల మాంత్రికుడికి లేదని తాజాగా తెలిసింది. ఫిబ్రవరి నుంచి తారక్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించిననున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనుంది.
ఈ క్రమంలో ఈ చిత్రంలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించాయి. జాన్వీ కపూర్, పూజా హెగ్డే.. ఇలా పలువురు త్రివిక్రమ్ మనసులో ఉన్నట్లు చెప్పారు. కానీ తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం త్రివిక్రమ్, కీర్తి సురేష్‌ని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు కీర్తి ఒప్పుకుంటే.. మరో క్రేజీ పెయిర్‌ని చూసే అవకాశం తెలుగు చిత్ర అభిమానులకు లభిస్తుంది. కాగా గతంలో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అఙ్ఞాతవాసిలో కీర్తి సురేష్ నటించారు. అయితే ఈ సినిమా అనుకున్న విధంగా ఆడలేదు.
Also Read :
తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే
పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ