ఆ సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. ‘చెక్’ మరో ఎత్తు.. మీడియా సమావేశంలో హీరో నితిన్
Check Movie: నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. నితిన్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల..
Check Movie: నితిన్ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. నితిన్ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఫ్యామిలీ, లవ్‌స్టోరీస్, యాక్షన్ సినిమాలు చాలా చేశానని.. కానీ ఇలాంటి వైవిధ్యమైన సినిమా చేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ సినిమా 80శాతం జైలు వాతావరణంలోనే సాగుతుందని.. దానికోసం చాలా కష్టపడ్డానని వివరించారు. గతంలో తాను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. చెక్ మూవీ మరో ఎత్తుగా ఉంటుందని నితిన్ పేర్కొన్నారు. తాను చేసిన ఆదిత్య పాత్రతో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నితిన్ తెలిపారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ.. నితిన్ లేకపోతే ఈ సినిమా లేదని.. ఆయన కెరీర్‌కు మంచి పేరు తీసుకొస్తుందంటూ తెలిపారు. నిర్మాత ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. గతేడాది ఓటీటీ వేదికగా రెండు చిత్రాలు విడుదల చేసి సక్సెస్ అయ్యామని.. ఇప్పుడీ చిత్రంతో తమ సంస్థ మరో మెట్టు పైకెక్కుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్, సాయిచంద్, కల్యాణి మాలిక్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు.
Also Read: