Pawan Kalyan : బండ్ల గణేశ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్.. దర్శకుడు అతడేనా..?
ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌కు తాను అభిమానిని కాదని.. భక్తుడినంటూ చెబుతుంటారు నిర్మాత బండ్ల గణేష్.
Pawan Kalyan: ఇటీవల పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్‌కు తాను అభిమానిని కాదని.. భక్తుడినంటూ చెబుతుంటారు నిర్మాత బండ్ల గణేష్. ఆయనతో గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని తీసిన ఆయన తన దేవుడితో మరో సినిమా తీయనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనతో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. వీరిద్దరి కాంబోలో గబ్బర్‌సింగ్ లాంటి సినిమా రిపీట్ కావాలని కోరుకుంటున్నారు.
బండ్ల గణేశ్‌తో సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.అయితే డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ పవన్ కళ్యాన్ తో ఓ సినిమా చేయాలనీ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాను బండ్ల నిర్మిస్తారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిస్తున్న లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మరే సినిమాను ప్రకటించలేదు పూరీ. రానున్న రోజుల్లో పవన్-పూరీ-బండ్ల గణేశ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ నటించిన వకీల్‌సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. మరోవైపు అయ్యప్పనుమ్ కొషియుమ్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
‘పక్కా కమర్షియల్’ గా రానున్న మ్యాచో హీరో.. ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా కథతో ఈ మూవీ రానుందా..?